- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brutal Murder: హైదరాబాద్ వ్యాపారి దారుణ హత్య.. ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (హైదరాబాద్) ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ చెందిన వ్యాపారి రమేష్ (Ramesh), నిహారిక (Niharika) భార్యభర్తలు. గత కొన్నేళ్లుగా నగరంలోనే వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, ఇటీవలే నిహారికకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర బంధానికి దారి తీసింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. భర్త పేరు మీద ఉన్న రూ.8 కోట్ల ఆస్తిని ఎలాగైనా కాజేయాలని భార్య నిహారిక ప్రియుడితో కలిసి భర్త హత్యకు పక్కా ప్లాన్ చేసింది.
అనంతరం భర్తకు మాయమాటలకు చెప్పి భార్య నిహారిక, ప్రియుడితో కలిసి కారులో రమేష్‌ను భువనగిరి (Bhongir) శివారు ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశారు. అనంతరం ఎవరికీ అనుమాన రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని కారులో కర్ణాటక రాష్ట్రం (Karnataka State)లోని ఊటీ (Ooty)కి తీసుకెళ్లారు. అక్కడ హర్యానా (Haryana)కు చెందిన రాణా అనే వ్యక్తి సాయంతో ఊటీ కాఫీ ఎస్టేట్ (Ooty Coffee Estate)లో నిందితులు రమేష్ మృతదేహాన్ని తగులబెట్టారు. అయితే, ఆ మరునాడు కాఫీ తోటలో పనికి వచ్చిన కూలీలు సగం కాలిన మృతదేహాన్ని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందజేయగా.. రమేష్ హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. నిహారిక, ఆమె ప్రియుడు, హత్యకు సహకరించిన రాణాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.