ఇంకా లభించని ముగ్గురి ఆచూకీ.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

by Sathputhe Rajesh |
ఇంకా లభించని ముగ్గురి ఆచూకీ.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
X

దిశ, రామగిరి: రామగుండం రీజియన్ పరిధి అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం సంభవించి ఒక రోజు జరిగినా.. ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు తెలియరాలేదు. సోమవారం మధ్యాహ్నం సుమారు ౨ గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు చిక్కుకున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు వీరిలో ఎరుకల వీరయ్య, జాడి వెంకటేశ్వర్లు, పిల్లి నరేష్ లను బయటికి తీసుకువచ్చి, గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు సురక్షితంగానే ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం రవీందర్ అనే వ్యక్తి ఆచూకీ లభ్యమైంది. ఆయన ప్రస్తుతం మాట్లాడుతున్నాడనే సమాచారం తెలిసింది. రవీందర్ ను బయటికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మిగిలిన ముగ్గురి వివరాలు ఇంకా తెలియరాలేదు. వారిలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఎస్.జయరాజ్, అసిస్టెంట్ మేనేజర్ తేజావత్ చైతన్య తేజ, తోట శ్రీకాంత్ ల కోసం రెస్క్యూ టీం ప్రయత్నాలు చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed