కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ, టాస్క్ ఫోర్స్ టీంల స్పెషల్ డ్రైవ్

by Rajesh |
కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ,  టాస్క్ ఫోర్స్ టీంల స్పెషల్ డ్రైవ్
X

దిశ, సిటీ బ్యూరో : హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ బృందాల దాడులు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం నగరంలో పేరుగాంచిన హోటళ్లపై దాడులు నిర్వహించి 29 హోటళ్లపై కేసులు నమోదు చేసిన ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ బృందం శుక్రవారం కూడా నగరంలోని లక్డీకాపూల్, సైఫాబాద్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లోనే హోటళ్లపై దాడులు నిర్వహించారు. సుఖ సాగర్ హోటల్‌తో పాటు మాదాపూర్‌లోని ‘ది రామేశ్వరం కేఫ్’లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాలం చెల్లిన వంట సామాగ్రితో పాటు కుళ్ళిన మటన్, చికెన్ డిష్‌లను వాటిలో కలిపే సింథటిక్ కలర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ది రామేశ్వరం కేఫ్ హోటల్లో కిచెన్ మొత్తం అపరిశుభ్రంగా బొద్ధింకలతో నిండి ఉండడాన్ని గమనించిన ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ బృందం అధికారులు కంగుతిన్నారు.

Advertisement

Next Story

Most Viewed