IAS Transfers: తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీ.. వికాస్ రాజ్‌కు కీలక పదవి

by Satheesh |   ( Updated:2024-07-20 15:03:02.0  )
IAS Transfers: తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీ.. వికాస్ రాజ్‌కు కీలక పదవి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కంటిన్యూ అవుతోంది. ఇటీవల భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేసిన రేవంత్ సర్కార్.. ఇవాళ మరోసారి ఐఏఎస్‌ల బదిలీ చేపట్టింది. తాజాగా ఆరుగురు ఐఏఎస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేయడంతో పాటు బాధ్యతలు అప్పగించింది. ఇటీవల రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బాధ్యతల నుండి రిలీవ్ అయిన వికాస్ రాజ్‌ను రవాణ, హౌసింగ్, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) స్పెషల్ సీఎస్‌గా నియమించింది. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా మహేష్ దత్ ఎక్కా, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఎ.శరత్, గిడ్డంగుల కార్పొరేషన్ ఎండీగా కొర్రా లక్ష్మి, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సెక్రటరీగా ఎస్. హరీష్, మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా రాధిక గుప్తాలను అపాయింట్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Next Story