- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: రిజర్వేషన్లపై ప్రధాని మోడీ మరోసారి హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: రిజర్వేజన్లపై ప్రధాని మోడీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బుధవారం వేములవాడలో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించిన రిజర్వేషన్లకు గండికొట్టి కాంగ్రెస్ తన ఓటు బ్యాంక్ అయిన ముస్లింలకు ఇవ్వాలనుకుంటోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ చిన్నచూపేనని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ చేస్తోన్న రాజకీయాలతో ఓబీసీలకు తీవ్ర నష్టమని హెచ్చరించారు. మాదిగలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతోందని మండిపడ్డారు. మన దేశంలో ఎంతో సమర్ధత ఉన్నా ఇన్నేళ్లు కాంగ్రెస్ ఆ సామర్థ్యాన్ని నాశనం చేసి సమస్యల వలయంగా మార్చిందని నిప్పులు చెరిగారు. మూడో దశ పోలింగ్ తర్వాత కాంగ్రెస్, ఇండియా కూటమి ఫ్యూజ్ ఎగిరిపోయిందని సెటైర్ వేశారు. దేశ అభివృద్ధికి అటంకంగా మారిన కాంగ్రెస్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.