- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: హైదరాబాద్‌లో మరోసారి ఈడీ రైడ్స్ కలకలం
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు కలకలం రేపుతున్నాయి. బుధవారం హైదరాబాద్ కేంద్రంగా నడిచే మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఏకకాలంలో నగరంలోని 6 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహేష్ బ్యాంక్ చైర్మన్ రమేష్ కుమార్, ఎండీ పురుషోత్తం దాస్, సీఈవో, డైరెక్టర్ల ఇళ్లతో పాటు సోలిపురం వెంకట్ రెడ్డితో పాటు మరో ఇద్దరు పిల్లలు, సోదరుల ఇళ్లలో అధికారులు రైడ్స్ చేస్తున్నారు. కాగా, మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో రూ.300 కోట్ల నిధుల గోల్ మాల్‌పై హైదరాబాద్ సిటీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ చేస్తోన్నట్లు సమాచారం. అనర్హులకు రుణాలు ఇచ్చి.. హవాలా ద్వారా డబ్బులు మళ్లించినట్లు గుర్తించిన ఈడీ రంగంలోకి దిగి సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.