JP Nadda టూర్ ఖరారు.. టీఆర్ఎస్ కు షాక్ తప్పదా?

by samatah |   ( Updated:2022-12-05 07:23:02.0  )
JP Nadda టూర్ ఖరారు.. టీఆర్ఎస్ కు షాక్ తప్పదా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైంది. ప్రధాన పార్టీల నేతలు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది. ఆ పార్టీ అగ్రనేతలు వరుసగా తెలంగాణకు క్యూ కట్టారు. తాజాగా మరోసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించబోతున్నారు. డిసెంబర్ 16న తెలంగాణకు జేపీ నడ్డా రాబోతున్నారు. కరీంనగర్ లో ఈ నెల 16న తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముంగిపు సభ జరగనుంది. ఈ సభకు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది. తెలంగాణపై బీజేపీ పెద్దలు ఫోకస్ పెట్టిన నేపథ్యంలో జేపీ నడ్డా కరీంనగర్ టూర్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

టీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ సారి ఎవరికి షాక్?

గత కొంత కాలంగా టీఆర్ఎస్ బీజేపీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. దీనికి తోడు వలసల రూపంలో కారు జోరుకు స్పీడ్ వేయాలని బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోంది. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసు ఈ ప్రక్రియకు ఆటంకం కలిగించినా జేపీ నడ్డా పర్యటన నేపథ్యంలో మరోసారి వలసల అంశం తెరపైకి వస్తోంది. టీఆర్ఎస్ నేతలు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ చాలా కాలంగా చెబుతూ వస్తోంది. సమయం, సందర్భం వచ్చినప్పుడు వారంతా కాషాయ తీర్థం పుచ్చుకుంటారని, కారు పార్టీ ఖాళీ కావడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకున్న నేపథ్యంలో జేపీ నడ్డా సమక్షంలో ఆ మేరకు టీఆర్ఎస్ నుంచి బిగ్ వికెట్స్ డౌన్ అవుతాయా? ఆ దిశగా కమలనాథుల చేతిలో ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అనే చర్చ తెరపైకి వస్తోంది. మరో వైపు బీజేపీలో చేరుతున్న వారి జాబితాలో కాంగ్రెస్ నేతలే ఎక్కువగా ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మర్రిశశిధర్ రెడ్డి బీజేపీ గూటికి చేరిపోయారు. ఆయన బాటలో మరి కొంత మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జేపీ నడ్డా టూర్ పై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంంది.

Read More.......

Bandi Sanjay కి బాసర వేద పాఠశాల విద్యార్థుల ఆశీర్వాదం

Advertisement

Next Story