- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కూళ్లలో ఆకస్మిక తనిఖీలు.. బస్సుల ఫిట్నెస్పై ఆరా!
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సైబరాబాద్మహిళా, శిశు రక్షణా విభాగానికి చెందిన అధికారులు శుక్రవారం ట్రాఫిక్అధికారులతో కలిసి కమిషనరేట్పరిధిలోని వేర్వేరు పాఠశాలల్లో నడుపుతున్న స్కూల్బస్సులను ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్బస్సులు పూర్తి ఫిట్నెస్తో ఉన్నాయా? అర్హులైన వారే డ్రైవర్లుగా పని చేస్తున్నారా? అన్న అంశాలపై విచారణ జరిపారు. దాంతోపాటు ఆయా స్కూల్బస్సులకు చెందిన డాక్యుమెంట్లను పరిశీలించారు. కమిషనరేట్పరిధిలోని పలు ఇంటర్నేషనల్స్కూళ్లలో నడుపుతున్న బస్సుల ఫిట్నెస్పై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఉమెన్అండ్చైల్డ్సెక్యూరిటీ వింగ్డీసీపీ నితికా పంత్నేతృత్వంలో వేర్వేరు బృందాలుగా ఏర్పడ్డ అధికారులు వేర్వేరు స్కూళ్లలో తనిఖీలు జరిపారు. ఆయా స్కూల్బస్సులపై స్కూల్డ్యూటీ అనే స్టిక్కర్లు అతికించారా? లేదా? అన్నది పరిశీలించారు.
దాంతోపాటు స్కూల్కాంటాక్ట్నెంబర్ను బస్సుపై రాశారా? బస్సుల లోపల ఫస్ట్ఎయిడ్కిట్లు ఉన్నాయా? అన్నది చూశారు. అనుకోకుండా అగ్నిప్రమాదం సంభవిస్తే మంటలు ఆర్పడానికి ఫైర్ఎస్టింగ్విషర్లు ఉన్నాయా? లేదా? అన్నది పరిశీలించారు. దాంతోపాటు బస్సు లోపల కెమెరాలను ఏర్పాటు చేశారా? అన్న దానిపై ప్రశ్నించారు. డ్రైవర్లకు లైసెన్సులు ఉన్నాయా? ట్రాఫిక్నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారా? పాల్పడితే ఎన్ని కేసులు నమోదై ఉన్నాయన్న దానిపై విచారణ చేశారు. రెండుకు మించి కేసులు ఉంటే అలాంటి డ్రైవర్లు స్కూల్బస్సులు నడపటానికి అనర్హులని స్పష్టం చేశారు. ఇక, డ్రైవర్లలో ఎవరికైనా నేర చరిత్ర ఉందా? అనే దానిపై కూడా ఆరా తీశారు. దీనికోసం పపిలియన్డివైస్లో డ్రైవర్ల వేలిముద్రలను సేకరించారు. వీటి ఆధారంగా డ్రైవర్లలో ఎవరెవరి పైనా కేసులు ఉన్నాయన్న దానిపై విచారణ చేయనున్నట్టు డీసీపీ నితికా పంత్తెలియచేశారు.