ప్రముఖుల ఇళ్ల ముందు క్షుద్ర పూజల కలకలం

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-28 15:25:58.0  )
ప్రముఖుల ఇళ్ల ముందు క్షుద్ర పూజల కలకలం
X

దిశ, మక్తల్ : మక్తల్ పట్టణంలోని అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖుడి ఇంటిముందు క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపాయి. కొందరు సదరు ప్రముఖుడి ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కొత్త బట్టలు ఉంచడంతో ఆందోళన నెలకొంది. రాత్రిపూట క్షుద్ర పూజలు చేసి ఆ తరువాత దుండగులు పరారయ్యారు. అయితే స్థానికంగా ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి చెందిన వీరు తమ పలుకుబడితో పట్టణంలో రియల్ ఎస్టేట్, భూముల వ్యవహారంలో ఇబ్బంది ఉన్న బాధితుల సహయం కోరితె ఆ మేరకు జోక్యం చేసుకొని న్యాయం చేసేవారు.

సహాయం చేసినందుకు గాను వారి నుండి లబ్ధి పొందేవారు. ఆ వ్యక్తులను మానసికంగా దెబ్బతీసేందుకు వారి ఇంటి ముందు ఇలాంటి ట్రిక్కులను ప్లే చేస్తూ ఉంటారని పోలీసులు తెలిపారు. సైన్స్ టెక్నాలజీని నమ్ముతున్న ఈ కాలంలో ఇదంతా ఏంటని కొంత మంది కొట్టి పారేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో తాజా అంశంపై పోస్టులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ముగ్గురు ప్రముఖుల ఇంటి ముందు క్షుద్ర పూజలు నిర్వహించినట్టు సమాచారం‌. బాధితుల ఇంటి ముందు ఉన్న సీసీ ఫుటేజిలో ఈ వ్యవహారం రికార్డ్ అయింది.

ఆ వ్యక్తుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఈ విషయంపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రముఖ నాయకుల ఇంటి ముందే క్షుద్ర పూజలపై ఆరా తీయగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. అధికార పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి ముఖ్య నేత అండదండలతో మక్తల్ పట్టణ శివారులో నారాయణపేట మార్గంలో ఉన్న ఒకే కుటుంబానికి కోట్ల విలువ చేసే భూమిని ఇద్దరు కొనుగోలు చేశారు. వారి మధ్య గొడవ జరిగి కోర్టుకు వెళ్లడంతో వివాదం కొనసాగుతూనే ఉంది. అందులో కొంత భూమిని అధికార పార్టీ మంత్రి స్నేహితులు, నాయకుల అండదండలతో భూమి చదును చేసి వెంచర్లుగా చేశారు.

రియల్ ఎస్టేట్ భూముల వ్యవహారంతో ఇరువురి మధ్య జరిగిన వ్యవహారంలో క్షుద్ర పూజ బాధితులు ఓ వర్గం వైపు జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. వారిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక మానసి కంగా దెబ్బ తీయడంతో తమకు కలిసి వస్తుందని ఇలా చేయించినట్లు తెలిసింది. బాధితుడిని అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు ఆశ చూపి వారితోనే ఇళ్ళ ముందు క్షుద్ర పూజలు చేయించినట్లు సమాచారం. ఈ ఘటన ప్రస్తుతం మక్తల్ పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది.

గత నెల రోజుల కింద బసవేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న వ్యక్తి ఇంటిలో ముందు. ప్రస్తుత ఓ రైస్ మిల్ ఓనర్ ఇంటిముందు క్షుద్ర పూజలు కొనసాగినట్టు. సమాచారం .ఈ వ్యవహారంపై సామాజిక మాద్యంలో పట్టణంలో చర్చ కొనసాగు తుంది. అయితే ఆరోపణ లు ఎదుర్కొంటున్న వారు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు ప్రచారం కోనసాగుతుంది.

Advertisement

Next Story

Most Viewed