- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటల సమక్షంలో బీజేపీలో చేరిన ఎన్నారై కిరణ్ కుమార్
దిశ, వెబ్ డెస్క్: మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో ఎన్నారై పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత వెంకట కిరణ్ కుమార్ కాళ్ళకూరి బీజేపీలో చేరారు. గల్ఫ్ దేశాల్లో వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో అపారమైన అనుభవం గడించి చాలా ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పని చేసిన కిరణ్ కుమార్ కాళ్ళకూరి. మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో సాధించిన ఘన విజయాలను చూసి తాను పార్టీ పట్ల ఆకర్షితులైనట్లు కిరణ్ కుమార్ కాళ్లకూరి మీడియాకు వెల్లడించారు. బాల్యంలో ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహించే శిక్షణ తరగతులకు హాజరైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారతదేశ సార్వభౌమత్వం, శాంతి భద్రతలు, అగ్రదేశాల సరసన నిలిపే అభివృద్ధి మోడీ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమైందని కిరణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. భారత దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం మోడీ అంటే ఒక భారత దేశ బ్రాండ్‌గా ప్రజలు భావిస్తున్నారని కిరణ్ కుమార్ కాళ్లకూరి తెలిపారు. కాగా కిరణ్ కుమార్ కాళ్లకూరి తెలుగులో హాష్టాగ్ కృష్ణా రామ, గ్రే సినిమాలను సైతం నిర్మించారు.