- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. జూనియర్ లెక్చరర్ల పోస్ట్‌లకు నోటిఫికేషన్ విడుదల
దిశ, తెలంగాణ బ్యూరో:ప్రభుత్వ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జూనియర్ లెక్చరర్ల నియామకం జరుగనుంది. ఆయా ప్రభుత్వ కాలేజీల్లో 1392 జూనియర్లెక్చరర్ల నియామకానికి ఆమోదం లభించింది. సబ్జెక్టుల వారీగా ఖాళీల జాబితాను ఖరారు చేశారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు టీఎస్‌పీఎస్సీ దీనిపై సమావేశమైంది. ప్రభుత్వం నుంచి ఇంటర్మీడియేట్తరుపున ఖాళీల జాబితాను ఇవ్వడంతో.. ఈ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ముందడుగు వేసింది. శుక్రవారం సాయంత్రం ఈ నోటిఫికేషన్జారీ చేసింది. స్వరాష్ట్రంలో తొలిసారిగా విడుదలవుతున్న ఈ నోటిఫికేషన్‌లో 1392 జూనియర్ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.
సబ్జెక్టుల వారీగా అరబిక్‌లో 2, బోటనీ 113, బోటనీ ఉర్దూ మీడియం 15, కెమిస్ట్రీ 113, కెమిస్ట్రీ ఉర్దూ మీడియం 19, సివిక్స్56, సివిక్స్ఉర్దూ మీడియం 16, సివిక్స్మరాఠా మీడియం 1, కామర్స్50, కామర్స్ఉర్దూ మీడియం 7, ఎకనామిక్స్81, ఎకనామిక్స్ఉర్దూ మీడియం 15, ఇంగ్లీష్ 153, ఫ్రెంచ్2, హిందీ సబ్జెక్టులో 117, హిస్టరీ 77, హిస్టరీ ఉర్థూ మీడియం 17, హిస్టరీ మరాఠా మీడియం 1, మ్యాథమెటిక్స్154, మ్యాథమెటిక్స్ఉర్దూ మీడియం 9, ఫిజిక్స్112, ఫిజిక్స్ఉర్దూ మీడియం 18, సంస్కృతం 10, తెలుగు 60, ఉర్దూ 28, జువాలజీ 128, జువాలజీ ఉర్దూ 18 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. వీటిలో మల్టీజోన్1 పరిధిలో 724, మల్టీజోన్2 పరిధిలో 668 పోస్టులున్నాయి. వీటిని మొత్తం భర్తీ చేయనున్నారు.
ఉర్దూ, మరాఠి మీడియం సబ్జెక్టులకు దరఖాస్తు చేసేవారు ఉర్దూ, మరాఠి మీడియంలో టెన్త్ వరకు ఫస్ట్ లాంగ్వేజ్‌గా, బ్యాచిలర్డిగ్రీలో సెకండ్లాంగ్వేజ్గా ఉండాలని నిబంధనల్లో వెల్లడించారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఈ నెల 16 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానుంది. జనవరి 6 వరకు ఆఖరు తేదీగా నిర్ధారించారు. దీనికి సంబంధించిన డిటైల్డ్ నోటిఫికేషన్కూడా తర్వలోనే వెబ్సైట్లో అప్ లోడ్ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఈ పోస్టుల భర్తీకి వచ్చే ఏడాది జూన్లేదా జూలైలో పరీక్ష ఉంటుందని ప్రాథమికంగా వెల్లడించారు.