- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లిక్కర్ స్కామ్‌లో కవితకు నోటీసులు.. BJP విధానమేంటో తేల్చిచెప్పిన బండి సంజయ్
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులివ్వడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఇవాళ కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ సేకరించిన ఆధారాలు, సాక్ష్యాల మేరకే కవితకు నోటీసులు ఇచ్చారని స్పష్టం చేశారు. సీబీఐ, ఈడీ అనేవి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు అని, వాటిల్లో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదన్నారు. ఆధారాలు ఉంటే తప్పు చేసింది ఎంతపెద్ద వారైనా ఉపేక్షించకూడదనేదే బీజేపీ విధానమని క్లారిటీ ఇచ్చారు. బీజేపీ చేపట్టిన
విజయ సంకల్ప యాత్రకు ప్రజల నుండి అద్భుతమైన స్పందన వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సారి బీజేపీ 370 ఎంపీ సీట్లు సాధిస్తుందని, మరోసారి కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను సీబీఐ నిందితురాలిగా చేర్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 26వ తేదీన విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. సీబీఐ నోటీసులు రాజ్యాంగ విరుద్ధమని.. ముందస్తు షెడ్యూల్ వల్ల విచారణకు హాజరు కావడం లేదని సీబీఐకి కవిత లేఖ రాశారు.