- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ పాలనలో అంతా అవినీతే : వైఎస్ షర్మిల
దిశ, పిట్లం : ప్రజా ప్రస్తావన యాత్రలో భాగంగా వైఎస్ షర్మిల బుధవారం పిట్లం మండలకేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ తెలంగాణలో సమస్యలు లేని గ్రామం లేదని అన్నారు. అలాగే సమస్యలు లేని వర్గం లేదని, ప్రతి వర్గాన్ని 8 ఏళ్లుగా కేసీఆర్ మోసం చేస్తున్నారని అన్నారు.
వైఎస్సార్ హయాంలో ఎవరికైనా కష్టం వస్తే తన బిడ్డకే వచ్చినట్లు పరిష్కారం చేసే వారని ఆమె అన్నారు. ఇప్పుడు వీఆర్ఏలు రాష్ట్రంలో 80 రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. వీఆర్ఏలు అసలు మనుషులే కాదన్నట్లు చూస్తున్నారు. ప్రతి వర్గాన్ని కేసీఆర్ ఆగం చేశాడు. ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు.
కేసీఆర్ కి ఆయన కొడుకుకి, కూతురికి, అల్లుడికి అయ్యింది బంగారు తెలంగాణ అని ఎద్దేవా చేశారు. అలాగే కేసీఆర్ పార్టీకి, ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా బంగారు తెలంగాణ అయిందన్నారు. బంగారు తెలంగాణ కళ్ళముందు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా కనిపిస్తున్నా భర్తీ చేయడం లేదన్నారు. డిగ్రీలు, పీజీలు చదివి పత్తి తియ్యబోతున్నారన్నారు. ఆటో డ్రైవర్లుగా మిగిలి పోతున్నారు.
16 వేల కోట్ల రాష్ట్రాన్ని 4 లక్షల అప్పుల కుప్ప చేసి పెట్టాడు. ఇంత అప్పు చేసినా దేనికి డబ్బు లేదు అంటున్నాడు. అంతా స్వాహా చేసేశాడు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ల పేరు చెప్పి మొత్తం దోచేశారు. 70 వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో తినేశాడు. ఆ సొమ్ముతో ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టాడు. విమానాలు కొంటున్నాడు.
మొన్న ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అయ్యిందని కోడిని, క్వాటర్ ని పంచాడన్నారు. క్వాటర్, కోడి పంచితే ఇక బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అని అనుకోవాలి కదా అని షర్మిల ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎప్పుడు బయటకు వచ్చినా ఓట్ల కోసమే వస్తాడు. ఓట్లు గుద్దించుకోవడం మాత్రమే కేసీఆర్ కు తెలుసన్నారు. కేసీఆర్ ఆగడాలు 8 ఏళ్లుగా సాగినయి అంటే కాంగ్రెస్, బీజేపీ వైఫల్యమే అని, ప్రతిపక్షాలు ప్రశ్నించి ఉంటే...కేసీఆర్ అరాచకాలు సాగేవి కాదు. ఈ సారి కేసీఆర్ కి కర్రు కాల్చి వాత పెట్టాలి.
పాలకులు ప్రజలకు సమస్యలు లేవని బుకాయిస్తున్నారన్నారు. సమస్యలు ఉన్నాయని తాను పాదయాత్ర చేస్తూ సమస్యలను ఎత్తి చూపిస్తున్న వైఎస్సార్ సంక్షేమ పాలన తిరిగి తీసుకు వస్తుందన్నారు. వైఎస్సార్ ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తా. వచ్చే ఎన్నికలలో వైయస్సార్ తెలంగాణ అన్ని సమస్యలు పరిష్కరిస్తానని తొలి సంతకం నిరుద్యోగుల భృతి పైనే అని షర్మిల అన్నారు. తిమ్మా నగర్ గ్రామానికి చెందిన యువకులు ప్రజా ప్రస్తావన యాత్రలో పాల్గొని విజయవంతం చేశారు.