సెలక్షన్ చేసింది మీరు..రాంగ్ సెలక్షన్ అంటుంది మీరే ఏది నిజం..?

by Naveena |
సెలక్షన్ చేసింది మీరు..రాంగ్ సెలక్షన్ అంటుంది మీరే ఏది నిజం..?
X

దిశ, గాంధారి: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు విద్యాశాఖ అధికారులు చేసిన తప్పుకు అభం శుభం తెలియని అమాయకుడు బలి అయ్యాడు. చిన్న మిస్టేక్ తో ఇలా జరిగిందని చాలా సులభంగా చెప్పడం జరిగింది. ఉద్యోగం సాధించాలనే సంకల్పంతో రాత్రింబవళ్లు కష్టపడి చదివి పరీక్ష రాసి.. దాంట్లో ఎలాగైనా సెలెక్ట్ అవుతానని ధీమాతో..జిల్లా ఆఫీస్ నుంచి ఫోన్ రాగానే అతని ఆశలకు హద్దే లేకుండా పోయింది. కానీ తీరా చూస్తే ఆశ కాస్త నిరాశ గానే మిగిలిన సంఘటన అందరిని కలిచి వేస్తుంది. మొన్న జరిగిన డీఎస్సీ 2024 నియామకాల్లో మీకు ఉద్యోగం.. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ లో సెలెక్ట్ అయ్యారు. మీకు మెసేజ్ కూడా వచ్చింది కావచ్చు చూసుకోండి అని జిల్లా విద్యాశాఖ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద పోతంగల్ గ్రామానికి చెందిన కారంగుల సాయి రెడ్డి

అక్టోబర్ 8న వెలువడిన ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ లో సెలెక్ట్ అయ్యారు. మరుసటి రోజు ఉదయం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి హైదరాబాద్ సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంది. అంతేకాకుండా అదే రోజు రాత్రి 8 గంటలకు TSONLN తో మెసేజ్ కూడా వచ్చింది. అంతా బాగానే ఉంది అనుకొని తీరా తొమ్మిదవ తేదీన ఎల్బి నగర్ వెళ్లడానికి బస్సులకు అతికించిన సెలెక్టెడ్ లిస్టులో సాయి రెడ్డి పేరు ఉండడంతో.. అతను కూడా సంతకం పెట్టి వెళ్లి బస్సులో కూర్చోవడం జరిగింది. సెలెక్టెడ్ లిస్టులో ఉన్న బస్సులో కూర్చున్న అభ్యర్థులకు అటెండెన్స్ కూడా తీసుకున్నారని సాయి రెడ్డి తెలిపారు. ఇంతవరకు బాగానే జరిగింది కానీ ..సీఎం ప్రోగ్రాం వెళ్లేందుకు కూడా సీఎం పాస్ కూడా సాయి రెడ్డికి ఇచ్చారు. ఇందులో కొసమెరుపు ఏంటంటే సీఎం ప్రోగ్రాం కంప్లీట్ అయిన తర్వాత కూడా సాయి రెడ్డి కి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలేదు. దీంతో ఒక్కసారిగా సాయి రెడ్డి వెళ్లి జిల్లా విద్యాశాఖ అధికారి రాజును వివరణ అడిగారు. దీంతో చిన్న మిస్టేక్ వల్ల ఒకరికి రావాల్సిన ఉద్యోగం మీకు వచ్చిందని జిల్లా విద్యాశాఖ అధికారి సమాధానం ఇచ్చాడు.

తనకు జరిగిన తీరును వివరిస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ను సాయి రెడ్డి కలిసి తన గోడును వ్యక్తం చేస్తానన్నారు. అయితే కలెక్టర్ ఫిర్యాదు చేయగా.. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. విద్యాశాఖ అధికారులు చేసిన చిన్న పొరపాటుతో.. ఉద్యోగం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వారు గుండె నిబ్బరం లేకపోతే వారి పరిస్థితి ఏంటి...జిల్లాస్థాయి అధికారులకు, డీఈఓ చిన్న పొరపాటుగా కనిపిస్తుంది. కానీ మా భవిష్యత్తు అందులో ఉంది సార్ ఆఫ్ మార్క్ కోసం అహర్నిశలు కష్టపడ్డాం అంటూ తన ఆవేదన కలెక్టర్ తెలియజేశాడు

Advertisement

Next Story

Most Viewed