Slab leakage :చినుకు పడితే చిత్తడే.. అధ్వానంగా హాస్టల్ దుస్థితి

by Aamani |
Slab leakage :చినుకు పడితే చిత్తడే.. అధ్వానంగా హాస్టల్  దుస్థితి
X

దిశ,కోటగిరి : గత రెండు రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు కోటగిరి మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ పరిస్థితి అద్వానంగా మరిదనే చెప్పవచ్చు. సుమారు 80 మంది విద్యార్థులు ఉన్న హాస్టల్ లోని అన్ని గదుల్లో వర్షం కారణంగా స్లాబ్ నుంచి నీరు కారడం తో అన్ని గదులలోకి నీరు చేరడంతో గదులన్నీ చిత్తడిగా మారి విద్యార్థులు ఉండడానికి, పడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. వర్షం కారణంగా హాస్టల్ గదులలో తడి తేమ ఎక్కువగా ఉండడం వల్ల విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి హాస్టల్ను మరమ్మతులు చేయించాలని విద్యార్థులు తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

అధికారులకు సమాచారం అందించాం : ఎస్సీ హాస్టల్ వార్డెన్ నరహరి..

స్లాబ్ లీకేజ్ విషయంపై పలుమార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సమాచారం అందించడం జరిగిందని ఆయన అన్నారు. వర్షాకాలం కారణంగా విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారని అధికారులు వెంటనే స్పందించి మరమ్మత్తులు చేయించాలని అన్నారు.

Next Story

Most Viewed