- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral: HORN OK PLEASE .. వాహనాల వెనుక ఇలా ఎందుకు రాస్తారు..? అసలు అర్థం ఏమిటి?
దిశ, ఫీచర్స్ : మీరు జర్నీ చేస్తున్నప్పుడో, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడో ఇతర వాహనాలను గమనించారా? ఆటోలు, టాక్సీల వెనుక భాగంపై కొటేషన్లు రాసి ఉంటాయి. వాహనదారులు తమ ఆసక్తిని బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా నచ్చిన డైలాగ్‌లు లేదా సూక్తులు రాయించుకుంటారు. ఇక డీసీఎంలు, లారీలు వంటి పెద్ద పెద్ద వాహనాల వెనుక అయితే చాలా సాధారణంగా కనిపించే కొటేషన్ ‘Horn OK please’. ఇది చాలా ఫేమస్ కూడాను. ఏకంగా దీనిపేరుతో ఓ బాలీవుడ్ సినిమా కూడా వచ్చిందంటే ఎంత పాపులరో అర్థం చేసుకోవచ్చు. అయితే వాహనం వెనుక ఇలా రాయాలనే రూల్ ఏమీ లేదు. ప్రభుత్వ నిబంధన అస్సలు కాదు. అయినా ఎందుకు రాస్తారు? అంటే దీనివెనుక ఓ ప్రత్యేక కారణం ఉందంటున్నారు నిపుణులు. అదేంటో చూద్దాం.
‘హార్న్ ఓకే ప్లీజ్’ పదంలో Ok అని యూజ్ చేయడం వెనుక గల ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. 1939 నుంచి 45 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ సమయంలో డీజిల్ కొతర బాగా ఏర్పడింది. దీంతో ప్రజలు తమ అవసరాలకోసం ఎక్కువగా కిరోసిన్‌పై ఆధారపడటం మొదలు పెట్టారు. చివరికి వాహనాలకు ఇంధనంగా కూడా డీజిల్‌కు బదులు దానిని ఉపయోగించారు. అయితే కిరోసిన్‌కు చాలా స్పీడ్‌గా మండే స్వభావం ఉంటుంది. అందుకే దానిని రవాణా చేస్తున్న గూడ్స్ లారీలు, డీసీఎంల వెనుక ‘ఆన్ కిరోసిన్‘ (On Kerosene) అని రాసేవారట. అంటే తమ ‘వెహికల్‌లో కిరోసిన్ ఉంది. దగ్గరకు రాకండి’ అని దీని నిజమైన అర్థంగా అప్పట్లో అందరూ అర్థం చేసుకునేవారు. కాల క్రమేణా ఈ ‘On Kerosene’ పదమే షార్ట్‌కట్‌గా వాహనాలపై ‘Ok’ పదంగా మారిపోయిందని చెప్తారు. అంతే తప్ప ప్రస్తుతం దీనికి ప్రత్యేకించి అర్థాలేమీ లేవు. కాకపోతే కాలక్రమంలో వాహనాలపై అలా రాయడం అలవాటుగా, ఆనవాయితీగా మారిపోయింది.
మరికొందరు హార్న్ ఓకే ప్లీజ్ (Horn OK please) ‘టాటా ఓకే హార్న్ ప్లీజ్’ అనే కొటేషన్లు కూడా వాహనాల వెనుక రాస్తుంటారు. ఇందులో టాటా ఓకే ప్లీజ్ కొటేషన్ పుట్టుక వెనుక ఓ ప్రత్యేక కారణం ఉందంటున్నారు నిపుణులు. ఏంటంటే.. రెండవ ప్రపంచ యద్ధ కాలంలో పాపులరైన ‘హార్న్ ఓకే ప్లీజ్’ పదాన్ని టాటా కంపెనీ తన బిజినెస్ పెంచుకోవాలనే ఉద్దేశంతో ‘Tata ok please’ కొటేషన్‌గా వాడుకున్నట్లు చెప్తారు. ఈ కంపెనీకి అనేక హోటళ్లు, ఉప్పు తయారీ, లారీల తయారీ, కార్ల తయారీ వంటి వ్యాపారాలు ఉన్నాయి. గతంలో ఇది సబ్బుల తయారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేయగా.. దాని పేరు ‘ఓకే బాత్ సోప్’ అని ఉండేది. ఇందులో OK అనే పదానికున్న పాపులారిటీని ఇక్కడ వాడుకున్నట్లు పలువురు నిపుణులు పేర్కొంటారు. అంతేకాకుండా ఇటీవల ‘హార్న్ ఓకే కప్లీజ్’ కు వాహనదారుల్లో మరో కామన్ మీనింగ్ కూడా స్థిరపడిపోయింది. ఏంటంటే.. చాలా ఏండ్ల కిందట లారీలకు సైడ్ మిర్రర్లు ఉండేవి కాదు. దీంతో వెనుక వచ్చే వాహనాలు లారీ డ్రైవర్‌కు తెలిసేది కాదు. అందుకే ‘హార్న్ ఓకే ప్లీజ్’ అని రాసుకునేవారని చెప్తారు. అంటే వెనుక వస్తున్న వాహనదారులు హారన్ కొడితే.. ముందు వెళ్తున్న వాహనదారుడు పక్కకు తప్పుకుంటాడని దీనిని అర్థం చేసుకునేవారు.