- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
OTT: అక్కడికి పోవడమే గానీ, రావడం ఉండదు.. భయపెట్టేందుకు వచ్చేస్తున్న హారర్ థ్రిల్లర్..!
దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో థియేటర్ కంటే ఓటీటీల్లోనే ఎక్కువ సినిమాలు చూసేందుకు ఇష్ట పడుతున్నారు. ఒకప్పుడు వీటికి అంత డిమాండ్ లేదు. కరోనా తర్వాత నుంచి ఇది ట్రెండ్ సెట్ చేస్తుందనే చెప్పుకోవాలి. చిన్న సినిమాలు కూడా ఓటీటీ ఉందనే ధైర్యంతో ముందుకు అడుగు వేస్తున్నాయి. ఎందుకంటే, పెద్ద సినిమాలు వచ్చినప్పుడు చిన్న సినిమాలకి థియేటర్లు కూడా దొరకవు.
ధృవ వాయు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా 'కళింగ'. ఈ సినిమా సెప్టెంబర్ 13న ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా, ఈ సినిమా ఓటీటీకి సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. నెల కూడా తిరగక్కుండానే ఓటీటీ పలవర్స్ ను అలరించేందుకు ముస్తాబవుతోంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ‘ఆహా’లో ఈ నెల 4 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు. ‘అక్కడికి పోవడమే గానీ, రావడం ఉండదు’ అంటూ అదిరిపోయే క్యాప్షన్ తో రిలీజ్ డేట్ ను ప్రకటించారు.