Fancy Number: ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కు కాసుల వర్షం.. ఆ నంబర్ కోసం ఏకంగా రూ.20 లక్షలు

by Y.Nagarani |
Fancy Number: ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కు కాసుల వర్షం.. ఆ నంబర్ కోసం ఏకంగా రూ.20 లక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: ఫోన్ నంబరైనా, వెహికల్ రిజిస్ట్రేషన్ నంబరైనా ఫ్యాన్సీ నంబరైతే బాగుంటుందని చాలామంది అనుకుంటారు. కానీ.. ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంతోకొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొందరు అంత ఖర్చెందుకు? వచ్చిన నంబర్ తో సరిపెట్టుకుందాం అనుకుంటే.. మరికొందరు మాత్రం కావాలనుకున్న నంబర్ కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడరు. ఇప్పుడిదే ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయానికి కాసుల వర్షం కురిపిస్తోంది. ఒక వెహికల్ ఫ్యాన్సీ నంబర్ కోసం ఏకంగా రూ.20 లక్షలు పెట్టి మరీ కొన్నారు.

TG 09B సిరీస్ పూర్తయ్యి.. TG 09C సిరీస్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఈ సిరీస్ లో ఉన్న ఫ్యాన్సీ నంబర్లను వేలం పాడగా.. ఒక్కరోజులోనే రూ.47 లక్షల 12,265 ఆదాయం వచ్చినట్లు జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ రమేష్ తెలిపారు. ఇందులో TG 09B 9999 రిజిస్ట్రేషన్ నంబర్ ను లాట్ మొబైల్స్ సంస్థ అక్షరాలా రూ.20,01,111కు సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇక TG 09C 0001 ను యోధ్ స్టోర్ వారు రూ.10,27,777 కు దక్కించుకున్నారని తెలిపారు. 0006 నంబర్ ను పోరస్ ఆగ్రో ఫుడ్ ప్రొడక్ట్స్ రూ.3.85 లక్షలకు, 0009 నంబర్ ను దండు ఎనర్జీ రూ.2.75 లక్షలకు, 0007 నంబర్ ను సుబ్బాయమ్మ అనే మహిళ రూ.1,77,777 లక్షలకు పొందినట్లు తెలిపారు. వెహికల్ నంబర్స్ వేలంలో ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కు ఇలా కాసుల వర్షం కురిసింది.

Next Story

Most Viewed