- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైనర్ డ్రైవింగ్..ధ్వంసమైన టీ స్టాల్..
దిశ, పేట్ బషీరాబాద్: మైనర్ బాలుడు నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో ఒక టీ స్టాల్ ధ్వంసం అవడమే కాకుండా ఇద్దరికీ గాయాలైన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చింతల్ ప్రధాన రహదారి హ్యాపీ చిల్డ్రన్ పిల్లల ఆసుపత్రి వద్ద ఓం సాయి టీ స్టాల్ పేరిట ఏక్ నాథ్ అనే వ్యక్తి చాయి దుకాణం నిర్వహిస్తున్నాడు. కాగా ఓ కారు చింతల్ మార్కెట్ వైపు టర్నింగ్ తీసుకొని సమయంలో అక్కడే ఉన్న టీ స్టాల్ పైకి దూసుకు వెళ్ళింది. దీంతో అక్కడే పని చేసుకుంటున్నారు యజమాని ఏకనాథ్ తో పాటుగా అతని కుమారుడు సాయిరాజ్ కు గాయాలు అవ్వడం తో పాటుగా, టీ స్టాల్ దెబ్బతింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారును ఒక మైనర్ బాలుడు డ్రైవ్ చేస్తున్నాడని, మైనర్ తో పాటుగా పక్కనే ఉన్న మరో వ్యక్తి పోటుగా మద్యం తాగి ఉన్నాడని చెప్తున్నారు. ఈ ఘటనపై బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని చెప్పగా, వాళ్లు వాళ్లు మాట్లాడుకుని కాంప్రమైజ్ అయ్యారని జీడిమెట్ల పోలీసులు తెలుపుతున్నారు. మైనర్ బాలుడికి డ్రైవింగ్ చేయడానికి అనుమతించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా కారును సైతం సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.