మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

by Sridhar Babu |
మహిళలు అన్ని రంగాలలో రాణించాలి
X

దిశ, నిజామాబాద్ సిటీ : మహిళలు మగవారితో సమానంగా అన్ని రంగాలలో రాణించాలని నిజామాబాద్ మొదటి అదనపు మేజిస్ట్రేట్​ ఖుష్బూ ఉపాద్యాయ అన్నారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మహిళా పోలీస్ సిబ్బందితో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమంను ప్రారంభించారు. అనంతరం మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు బహుమతుల ప్రదానం చేయడం చేశారు. ఈ సందర్భంగా మొదటి అదనపు మేజిస్ట్రేట్​ మాట్లాడుతూ మహిళలు

మనోధైర్యాన్ని కోల్పోకుండా అన్ని రంగాలలో ముందుండాలని, ప్రతి మహిళకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని, ఆ లక్ష్యసాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని అన్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగినవార్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ అనందంగా, స్వేచ్ఛగా జీవితంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ప్రొబెషనరీ ఐపీఎస్ బి.చైతన్య రెడ్డి, డా. కిరణ్మయి (ట్రెయినీ ఐఏఎస్​), మున్సిపల్ కమిషనర్ తేజిత, ఇన్స్పెక్టర్ శ్రీలత, ఎస్ఐ అంజమ్మ, ఎస్ఐ పద్మ, ఎస్ఐ కుమారి ప్రవళిక, ఆర్.ఎస్.ఐ స్రవంతి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, పోలీస్ కార్యాలయం సిబ్బంది. హోమ్ గార్డ్సు సిబ్బంది, కళా బృందం పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed