Vinesh Phogat: ప్రతి ఆడపిల్లకు, మహిళకు విజయాన్ని అంకితమిచ్చిన వినేష్ ఫొగాట్

by Shamantha N |   ( Updated:2024-10-08 11:31:16.0  )
Vinesh Phogat: ప్రతి ఆడపిల్లకు, మహిళకు విజయాన్ని అంకితమిచ్చిన వినేష్ ఫొగాట్
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలోని జూలానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన వినేష్ ఫోగట్ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌పై విజయం సాధించారు. కాగా.. ఎన్నికల్లో విజయంపై ఆమె స్పందించారు." పోరాడే మార్గాన్ని ఎంచుకున్న ప్రతిఆడపిల్ల, మహిళకు ఈ విజయం అంకితం. ఈ దేశం నాకిచ్చిన ప్రేమను, నమ్మకాన్నినిలబెట్టుకుంటాను" అని వినేష్ అన్నారు. హర్యానాలో అధికార భారతీయ జనతా పార్టీ వరుసగా మూడోసారి విజయం సాధించడం ఖాయమని ఎన్నికల సంఘం గణాంకాలు తెలియజేస్తుండగా.. ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పుట చేస్తుందని వినేష్ ఫొగాట్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మాజీ రెజ్లర్ తన ప్రత్యర్థి యోగేష్ కుమార్ నిని 5,761 ఓట్ల తేడాతో ఓడించింది.

భజరంగ్ పూనియా అభినందనలు

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు భజరంగ్ పూనియాతో పాటు వినేష్ కాంగ్రెస్‌లో చేరారు. కాగా.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సోషల్ మీడియా వేదికగా వినేష్ ని పూనియా అభినందించారు. "వినేష్ ఫొగాట్ విజయం సాధించినందుకు ఆమెకు అభినందనలు. ఈ పోరు కేవలం జూలానా సీటు కోసమో.. లేదా మరో 3-4 మంది అభ్యర్థులతో కాదు. ఇది పార్టీల మధ్య పోరు. ఈ పోరాటం బలమైన అణచివేతకు వ్యతిరేకంగా జరిగింది. దేశంలోని అణచివేత వర్గాలపై విజయం సాధించాయి" అని భజరంగ్ పూనియా ఎక్స్‌లో రాసుకొచ్చారు.

Advertisement

Next Story