Smugglers : బీఎస్ఎఫ్ జవాన్లపై బంగ్లా స్మగ్లర్ల దాడి.. సైన్యం చేతిలో చొరబాటు దారుడి హతం

by vinod kumar |
Smugglers : బీఎస్ఎఫ్ జవాన్లపై బంగ్లా స్మగ్లర్ల దాడి.. సైన్యం చేతిలో చొరబాటు దారుడి హతం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత సరిహద్దులోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ స్మగ్లర్లు బార్డర్ సెక్యురిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) జవాన్లపై దాడి చేశారు. అనంతరం సైన్యం ప్రతీకార దాడులు చేయడంతో ఒక చొరబాటుదారుడు ప్రాణాలు కోల్పోయాడు. త్రిపురలోని సల్పోకర్ సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 12 నుంచి 15 మంది స్మగ్లర్లు నిషేధిత వస్తువులను భారత్‌లోకి స్మగ్లింగ్ చేసుకుందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే బీఎస్ఎఫ్ జవాన్లు వారి కదలికలను గమనించారు. వారిని హెచ్చరించడంతో ఓ బీఎస్ఎఫ్ జవాన్‌ను చుట్టుముట్టిన స్మగ్లర్లు పదునైన ఆయుధంతో అతనిపై దాడి చేశారు. వెంటనే స్పందించిన ఇతర జవాన్లు స్మగ్లర్లపై కాల్పులు జరపగా ఓ చొరబాటు దారుడు హతమయ్యాడు. మిగతా నిందితులు తిరిగి బంగ్లాదేశ్‌కు పారిపోయారు. ఈ ఘటనలోత జవాన్ కు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, పది హేను రోజుల క్రితం పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా సరిహద్దు సమీపంలో స్మగ్లర్లు ఓ బీఎస్ఎఫ్ జవాన్‌పై దాడి చేశారు. దీంతో రెండు వరుస ఘటనల నేపథ్యంలో బంగ్లా సరిహద్దుల్లో సైన్యం అప్రమత్తమైంది.

Advertisement

Next Story

Most Viewed