అమ్మాయ్.. కండోమ్ వాడటం మర్చిపోకు

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-10-09 15:56:15.0  )
అమ్మాయ్.. కండోమ్ వాడటం మర్చిపోకు
X

డాక్టర్ గారూ... నా వయస్సు 27 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు. నా భర్తకు వేరే స్త్రీలతో లైంగిక సంబంధాలున్నాయి. అదేంటని నిలదీస్తే అరిచి, గొడవ పడతారు. నా గురించి అసలు పట్టించుకోరు, నాకు లైంగిక వ్యాధులు అంటిస్తారని భయంగా ఉంది. నేను డిగ్రీ వరకే చదివాను. నా సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? అయన పరువు పోతుందేమోనని ఇంతవరకూ ఆగాను.

రాయి స్త్రీలతో లైంగిక సంబంధాల వల్ల ప్రమాదకర సుఖవ్యాధులు- హెచ్.ఐ.వి., ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని పరువు కోసం పోకుండా వెంటనే మీ పుట్టింట్లో, అత్తగారింట్లో చెప్పు. అతని పరువు గురించి ఆలోచిస్తూ నీ జీవితం, పిల్లల జీవితం పణంగా పెడుతున్నందుకు అతడేమన్నా మారాడా? నిన్ను ఏ మాత్రం గౌరవించని నీ భర్త గురించి నువు కూడా ఆలోచించడం మానేయి. ముందు నువ్వు ఎస్.టి.డి.. వీ.డి.ఆర్.ఎల్- హెచ్.ఐ.వి. పరీక్షలు చేయించుకో. అతనికీ చేయించు, నీకు నెగెటివ్ వచ్చి అతనికి పాజిటివ్ వస్తే అతన్ని దూరంగా ఉంచు. కాపురమే కాదు. నీ ప్రాణం, పిల్లల జీవితం ముఖ్యం కదా? నీతో పాటు అతనికి నెగెటివ్ వస్తే, అతన్ని కౌన్సెలింగ్‌కు మెరైటల్ థెరపిస్ట్ వద్దకు తీసుకెళ్లు. మెరైటల్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ అతనికి ముఖ్యం. కేవలం వివాహేతర సంబంధాలు మానే దిశగానే కాదు.. ఇంటికి కుటుంబానికి సంబంధించి అతనిలో పూర్తిగా మార్పు వచ్చేదాకా చికిత్స కొనసాగాలి. అయినా మానకపోతే అతడిపై గృహ హింస కేసు పెట్టొచ్చు. అంత వరకు శారీరక సంబంధం విషయంలో అతనిలో జాగ్రత్తగా ఉండు. ఖచ్చితంగా కండోమ్ వాడకం మర్చిపోవద్దు.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్


Read More..

Personal Health: రోజూ ఆ పని చేస్తే బలహీనపడిపోతారా?

Advertisement

Next Story