నకిలీ విద్యార్హత సర్టిఫికెట్ల రాకెట్ గుట్టురట్టు..ఇద్దరు అరెస్ట్​

by Aamani |
నకిలీ విద్యార్హత సర్టిఫికెట్ల రాకెట్ గుట్టురట్టు..ఇద్దరు అరెస్ట్​
X

దిశ, చార్మినార్ : నకిలీ విద్యా సర్టిఫికెట్​ రాకెట్​ గుట్టును సౌత్​జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు రట్టు చేశారు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 84 నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్​ ఫోర్స్​ అడిషనల్​ డీసీపీ అందె శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం .... అంబర్​పేట్​ ఓవైసీ నగర్​లోని ఎంఎస్​ ఎంటర్​ ప్రైజెస్​ పేరుతో ఉన్న జిరాక్స్​ సెంటర్​పై సౌత్​జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు నిర్వహించారు. నకిలీ విద్యా సర్టిఫికెట్​ రాకెట్​ గుట్టును రట్టు చేశారు. ఇంటర్మీడియట్​, డిగ్రీ కి చెందిన నకిలీ విద్యా సర్టిఫికేట్​లను తయారు చేస్తూ పెద్ద మొత్తంలో విక్రయిస్తున్న మొహమ్మద్​ మహఫూజ్​ ఇక్బాల్​ అలియాస్​ ఇక్బాల్​ (41) అంబర్​పేట్​ ఓవైసీ నగర్​లోని ఎంఎస్​ ఎంటర్​ ప్రైజెస్​ పేరుతో ఉన్న జిరాక్స్​ సెంటర్ ను గత కొంతకాలంగా నడిపిస్తున్నాడు.

అంబర్​ పేట​ కు చెందిన షేక్​ ఇలియాస్​ అహ్మద్​ (34) స్నేహితుడు. గత కొంత కాలంగా అతని వ్యాపారంలో నష్టం రావడం తో స్నేహితుడు షేక్​ ఇలియాస్​ అహ్మద్ తో కలిసి మొహమ్మద్​ మహఫూజ్​ ఇక్బాల్ నకిలీ విద్యా సర్టిఫికెట్లు తయారు చేయాలనే పథకాన్ని రూపొందించారు. ఈ నేపధ్యంలోనే ఇంటర్​, డిగ్రీ కి సంబంధించిన నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్​ ఫోర్స్​ అడిషనల్​ డీసీపీ అందె శ్రీనివాస్ పర్యవేక్షణలో సౌత్​ జోన్​ టాస్క్​ ఫోర్స్​ ఇన్​స్పెక్టర్​ రాఘవేంద్ర బృందం దాడులు నిర్వహించి రెడ్​ హ్యాండెడ్​గా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 84 నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలు, 4 ఖాళీ సర్టిఫికేట్లు, జ్యూడిషియల్​ స్టాంప్​ పేపర్లు 14, ఎ4 సైజ్ పేపర్లు 40, ఒక సీపీయు, ఒక మానిటర్​, ఒక ప్రింటర్​, ఒక మౌస్​, ఒక కీబోర్డ్, రెండు సెల్​ ఫోన్లు, పెన్​ డ్రైవ్​లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed