తాగుడుకు బానిసై ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

by Jakkula Mamatha |   ( Updated:2024-10-08 14:01:15.0  )
తాగుడుకు బానిసై ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
X

దిశ,కళ్యాణదుర్గం:కంబదూరు మండలం ములకనూరు గ్రామానికి చెందిన రామాంజనేయులు(40) అనే వ్యక్తి తాగుడుకు బానిసై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. రామాంజనేయులు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story