Urine infections: తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి ఈ సమస్య ఓ కారణమే..?

by Anjali |
Urine infections: తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి ఈ సమస్య ఓ కారణమే..?
X

దిశ, వెబ్‌డెస్క్: తరచూ మూత్ర విసర్జన(urination) సమస్య ఎదుర్కొనే వారిలో మహిళలే ఎక్కువుంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక వయసు దాటాక మహిళల్లో చాలా సమస్యలు తలెత్తుతాయి. అందులో మూత్ర విసర్జన సమస్య ఒకటి. కానీ ఈ ప్రాబ్లమ్‌ను అంతగా కేర్ చేయరు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. కొంతమంది ఎవరు ఏమనుకుంటారోనని ఇబ్బంది పడి.. బయటకు చెప్పుకోరు. ముఖ్యంగా నైట్ ఎక్కువసార్లు బాత్రూమ్ వెళ్లడంతో సరిగ్గా పడుకోలేరు. దీంతో నిద్రలేమితో మానసిక(mental), శారీరక(physical) సమస్యలు తలెత్తుతాయి. అయితే మహిళల్లో ఈ సమస్య ఎందుకు ఎక్కువగా కనిపిస్తుందని దీనిపై అధ్యయనం చేయగా.. దీని వెనకున్న కారణాలు బయటపడ్డాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

మూత్ర విసర్జన సమస్య పలు రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు.. ఇవి క్రమంగా సరిగ్గా పనిచేయకపోతే మహిళలు తరచూ మూత్ర విసర్జన సమస్యతో బాధపడుతుంటారు. అలాగే గర్భాశయం(uterus)లో వాపు(swelling) లేదా రుగ్మతల(disorders) కారణంగా, ప్రెగ్రెన్సీ టైంలో మోనోపాజ్(Monopause) సమయంలో లేకపోతే.. ఇతర హార్మోనల్ ఛేంజెస్ కారణంగా.. మూత్రాశయంపై ఒత్తిడి పెరగడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.

శరీరంలో నీరు అవసరమైన దాని కంటే ఎక్కువ లేదా తక్కువ ఉండడం వల్ల మూత్రపిండాలపై ఎఫెక్ట్ చూపి తరచూ టాయిలెట్ వెళ్తుంటారు. మానసిక ఒత్తిడి కూడా ఓ కారణమేనంటున్నారు నిపుణులు. ఊబకాయం(obesity), షుగర్(Sugar) వంటి ప్రాబ్లమ్స్, కండరాల బలహీనత, పెల్విన్(Pelvin) కింద బలహీనమైనప్పుడు.. అలాగే అతిగా ఆల్కహాలు(Alcohols) తీసుకుంటే, కాఫీ(Coffee), సున్నితమైన ఫుడ్ తీసుకుంటే కూడా మూత్ర విసర్జనకు దారితీస్తుంది.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed