ఆటోను ఢీకొట్టిన MLA కారు.. ఇద్దరి పరిస్థితి విషమం

by Mahesh |
ఆటోను ఢీకొట్టిన MLA కారు.. ఇద్దరి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని శ్రీకాకుళం(Srikakulam) జిల్లా కొరసవాడ సమీపంలో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం(road accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను పాతపట్నం ఎమ్మెల్యే(Patapatnam MLA)కు చెందిన కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రమాద సమయంలో ఆ కారును పాతపట్నం ఎమ్మెల్యే కుమారుడు(Son of MLA) సాయి గణేష్ నడిపినట్లు తెలుస్తుంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed