GST Council: జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్.. ఆరోగ్య, జీవిత బీమాపై పన్ను రద్దు నిర్ణయం వాయిదా..!

by Maddikunta Saikiran |
GST Council: జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్.. ఆరోగ్య, జీవిత బీమాపై పన్ను రద్దు నిర్ణయం వాయిదా..!
X

దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman)అధ్యక్షతన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం రాజస్థాన్(Rajasthan)లోని జైసల్మేర్ (Jaisalmer)వేదికగా ఈ రోజు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ భేటీకి అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిదులు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ సమావేశంలో పలు వస్తువుల జీఎస్టీ రేట్లను ఛేంజ్ చేయడం, శ్లాబుల మార్పు వంటివి చర్చకు రానున్నాయి. అయితే ఈ సమావేశంలో ఆరోగ్య బీమా(Health insurance), జీవిత బీమా(Life Insurance)పై జీఎస్టీ తొలగిస్తారని తొలుత వార్తలు వినిపించాయి.కానీ దీనిపై జీఎస్టీ మండలి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా వేసింది. దీనిపై మరింత లోతైన చర్చ అవసరమని పలువురు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ రద్దు నిర్ణయాన్ని పోస్ట్ పోన్ చేసింది. కాగా రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా ప్రీమియం, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం లపై జీఎస్టీని మినహాయించాలని పాలసీ దారులు చాలా రోజుల నుంచి కేంద్రాన్ని కోరుతున్నారు.ఈ మేరకు గత నవంబర్ నెలలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై జీఎస్టీని తొలగించాలని నిర్ణయించుకుంది. కాగా దీనిపై ఈ రోజు జరిగిన సమావేశంలో ఆరంభంలోనే చర్చించిన కౌన్సిల్.. ఈ అంశాన్ని వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed