మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీలుగా ఆ ఇద్దరు స్టార్స్

by Hamsa |   ( Updated:2024-12-21 16:11:59.0  )
మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీలుగా ఆ ఇద్దరు స్టార్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. మయోసైటీస్(Myositis) కారణంగా గత కొద్ది కాలంగా ఆమె సోషల్ మీడియాకు పరిమితం అయింది. అయినప్పటికీ మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా మొదటి స్థానం దక్కించుకుంటూ సంచలనం సృష్టిస్తుంది. తాజాగా, ఆర్మాక్స్(Armax) నవంబర్ నెలలో అత్యంత ప్రేక్షాకాదరణ పొందిన హీరో-హీరోయిన్ల లిస్ట్‌ను విడుదల చేసింది. ఇందులో హీరోయిన్ల జాబితాలో సమంత మొదటి స్థానంలో నిలవగా.. హీరోల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు.

వీరిద్దరు అక్టోబర్ నెలలోనూ టాప్ వన్‌లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా ఉండటంతో అభిమానులు సంతోష పడుతున్నారు. అయితే సమంత సినిమాలు చేయనప్పటికీ మూడు నెలల పాటు మోస్ట్ పాపులర్ హీరోయిన్‌ల జాబితాలో టాప్ వన్‌లో ఉన్న సెలబ్రిటీగా రికార్డు సృష్టించింది. ఇక ప్రభాస్ విషయానికొస్తే.. ఆయన వరుస చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల ‘సలార్’ కల్కి సినిమాలతో ఘన విజయాలు తన ఖాతాలో వేసుకున్న డార్లింగ్ ప్రస్తుతం కల్కి-2, సలార్-2, స్పిరిట్(Spirit), ఫౌజీ, రాజాసాబ్( Raja Saab) చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇవన్నీ భారీ బడ్జెట్‌ మూవీస్ కావడంతో అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది.

Read More...

Anushka Shetty: ప్రభాస్‌ అలా ఉంటాడంటూ అనుష్క శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. హాట్ టాపిక్‌గా మారిన వీడియో



Advertisement

Next Story

Most Viewed