మహిళల ఐక్యతకు నిదర్శనం బతుకమ్మ

by Sridhar Babu |
మహిళల ఐక్యతకు నిదర్శనం బతుకమ్మ
X

దిశ,కామారెడ్డి : తెలంగాణ మహిళలకు బతుకమ్మ గొప్ప పండుగ అని, ఐక్యతకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం ఐడీఓసీలో జనహిత వారి సౌజన్యంతో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. మహిళా ఉద్యోగుల కోసం బతుకమ్మ వేడుకలను నిర్వహించడం అభినందనీయమన్నారు. బతుకమ్మ వేడుకలు, దసరా పండుగ సందర్భంగా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.

కలెక్టరేట్ లో బతుకమ్మ సంబరాలు నిర్వహించడంతో టీజీఓ, టీఎన్జీఓలను అభినందించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సంప్రదాయంగా బతుకమ్మ పండుగను మహిళలు నిర్వహించుకుంటారని తెలిపారు. మొదటి మూడు ఉత్తమ బతుకమ్మలకు బహుమతులను కలెక్టర్ ప్రదానం చేశారు. మొదటి బహుమతి ఐసీడీఎస్ శాఖకు అందించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ అధ్యక్షులు ఎన్.వెంకట్ రెడ్డి, టీజీఓ అధ్యక్షులు డా. ఆర్. దేవేందర్, సెక్రటరీ సాయి రెడ్డి, టీఎన్జీఓ నాయకులు సంతోష్, శివకుమార్, పోచయ్య పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed