నిబంధనలు పాటించని గ్యాస్ ఏజెన్సీ..

by Aamani |
నిబంధనలు పాటించని గ్యాస్ ఏజెన్సీ..
X

దిశ, బషీరాబాద్ : ఇంధన చమురు సంస్థ నిభందనలకు విరుద్దంగా ఓ ఏజెన్సీ గృహోపకరణ గ్యాస్ బండలను పక్కదారిన అమ్ముకుంటున్నారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో గత కొన్ని ఏళ్లుగా కొనసాగుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే గత కొన్ని ఏళ్లుగా వినియోగదారులకు హెచ్ పీ గ్యాస్ సేవలు అందిస్తున్న శ్రీ సత్యసాయి గ్యాస్ ఏజెన్సీ గ్రూహోపాకరుణ సిలిండర్లను హోటల్ , ధాబా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్,టీ పాయింట్ లకు సరఫరా చేస్తున్నారని మండల ప్రజలు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్దంగా డొమెస్టిక్ గ్యాస్ ను వ్యాపారస్థులకు విక్రయించడం ద్వారా ఇండ్లకు వంట గ్యాస్ కొరత ఏర్పడుతుందని వినియోగదారులు వాపోతున్నారు.చిన్న,పెద్ద వ్యాపారులకు కొన్ని సంవత్సరాల నుండి డొమెస్టిక్ గ్యాస్ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు పెద్దగా వినిపిస్తున్నాయి.

ఇంత జరుగుతున్న మండల అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో గ్యాస్ వినియోగదారులు, ప్రజలు అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.వాణిజ్య సిలిండర్ల గ్యాస్‌ ధరతో పోలిస్తే గృహ వినియోగ గ్యాస్‌ ధర తక్కువ ఉండడంతో హోటళ్లకు,టీ పాయింట్ లు , ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులు వీటి వినియోగానికి మొగ్గుచూపుతున్నారు. ఇదే అదునుగా తీసుకున్న గ్యాస్ ఏజెన్సీ. డోమాస్టిక్ గ్యాస్ వినియోగిస్తున్న వ్యాపారస్థుల నుండి ఒక్క సిలిండర్‌ కు రూ.150 నుంచి రూ.200వరకు గ్యాస్ డెలివరీ బాయ్ అదనంగా తీసుకుని సిలిండర్‌ ఇస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు.

వాణిజ్యం..

హోటళ్లు,టీ పాయింట్, ఫాస్ట్ ఫుడ్, ధాబా వంటి వాటికి వాణిజ్య సిలిండర్లను వాడాలి. అలా కాకుండా వ్యాపారస్తులు తక్కువ ధరకు వచ్చే డొమెస్టిక్ సిలిండర్ వాడుతున్నారు. వంట గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌కు ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ గ్యాస్‌ ఏజెన్సీల నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, గృహ వినియోగ వంట గ్యాస్‌ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు సరఫరా చేస్తున్నయి.

ఆరోపణలు..

డొమెస్టిక్‌ గ్యాస్‌ వినియోగదారులు తమ రిజిస్టిర్డ్‌ మొబైల్‌ నంబర్‌ తో ఆన్‌లైన్‌లో గ్యాస్‌ బుక్‌ చేస్తేనే సిలిండర్‌ డెలివరీ చేస్తారు. కానీ హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లలో గృహవినియోగ గ్యాస్‌ సిలిండర్లు బహిరంగంగానే కనిపిస్తున్నాయి. వీటిని అరికట్టే అధికారం పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులకు ఉన్నప్పటికీ వీటిని కట్టడి చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ఏజెన్సీ లపై చర్యలు తీసుకొని వాణిజ్యానికి గృహ వినియోగ సిలిండర్ సరఫరా నిలిపివేయాలని పలువురు కోరుతున్నారు.

సరఫరా లేక..

వంట గ్యాస్ సరఫరా లేక గ్యాస్ వినియోగదారులు తమ గ్రామాల నుంచి గ్యాస్ గోడౌన్ వెళ్లి గ్యాస్ తెచ్చుకోవాల్సిన పరిస్థులు ఏర్పడ్డయని వినియోగదారులు వాపోతున్నారు. గృహోపకరణ గ్యాస్ సరఫరాపై 50 నుంచి 80 వరకు అదనంగా తీసుకుంటున్నట్లు పలువురు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed