- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:‘త్వరలో గ్రామబాట కార్యక్రమం’.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల రాష్ట్రంలో జరిగిన చిన్నారి హత్య ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. హడావిడిగా ముగ్గురు మంత్రులు పుంగనూరులో పర్యటించారని తెలిపారు. పోలీసులు ఈ హత్య కేసును ఛేదించారని, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనను రద్దు చేసుకున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం మీడియాతో తెలిపారు.
ఇదిలా ఉంటే తాజాగా.. రాష్ట్రంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీలో వైసీపీ ఆధ్వర్యంలో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ బాట కార్యక్రమం చేపడతామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులతో తిరుపతిలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం శ్రమిస్తున్న వారికి పదవులు ఇస్తామని తెలిపారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు సమావేశానికి హాజరయ్యారు.