- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కేసీఆర్ నాకు అవకాశం ఇచ్చారు’.. తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై బీఆర్ఎస్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి అందరిని మోసం చేస్తున్నట్లు మాదిగలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అసెంబ్లీలో సభ్యుల మెప్పు పొందేందుకు అన్ని రాష్ట్రాల కంటే ముందే ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో అమలు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. మూడు ఎస్సీ ఎంపీ స్థానాల్లో రెండు మాలలు, ఒకటి బైండ్లకు ఇచ్చారు.
కానీ, మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని రాజయ్య మండిపడ్డారు. ఇదెక్కడి సామాజిక న్యాయమో తెలియడం లేదని విమర్శిచారు. కేసీఆర్ తనకు తెలంగాణ తొలి డిప్యూటీ సీఎంగా పనిచేసే అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణపై నాచేత అసెంబ్లీలో కేసీఆర్ తీర్మానం పెట్టించారని అన్నారు. రైతులను మోసం చేసినట్లు మాదిగలను మోసం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని సీరియస్ అయ్యారు. తెలంగాణ తక్షణమే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా పేరుతో ఇళ్లను కూలగొడుతున్నారని అన్నారు.