- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉగ్రవాదుల దాడిలో తండ్రి, సోదరుడిని కోల్పోయిన యువతి.. కాశ్మీర్ ఎన్నికల్లో మాజీ మంత్రిపై విజయం
దిశ, వెబ్ డెస్క్: దాదాపు పది సంవత్సరాల తర్వాత జరిగిన జమ్మూ, కాశ్మీర్ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఉగ్రవాదుల దాడిలో తండ్రి, సోదరుడిని కోల్పోయిన 29 ఏళ్ల యువతి.. ఓ మాజీ మంత్రిపై విజయం సాధించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. ఈ రోజు వెలువడిన జమ్మూ, కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కిష్ట్వార్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి షగున్ పరిహార్ 521 ఓట్ల తేడాతో విజయం సాధించింది. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి, మాజీ మంత్రి సజ్జాద్ అహ్మద్ కిచ్లూపై ఆమె గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇదిలా ఉంటే ఆమెను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడానికి ముందు.. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. అలాగే కాశ్మీర్ మహిళల అభ్యున్నతి కోసం అనేక చర్యలు తీసుకున్నారు. 29 ఏళ్ల షగుణ్ పరిహార్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్‌లో ఎంటెక్ పట్టా పొందారు. ఆమె ప్రస్తుతం పీహెచ్‌డీ చేసి J&K పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు సిద్ధమవుతోంది. ఆగస్టు 26వ తేదీ వరకు బీజేపీ ఆమెను కిష్ట్వార్ అభ్యర్థిగా ప్రకటించే వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని పరిహార్ సన్నిహిత వర్గాలు తెలిపారు. కాగా 2018లో.. పరిహార్ తండ్రి, అజిత్ పరిహా,ఆమె సోదరుడు, అప్పటి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అనిల్‌ను పంచాయితీ ఎన్నికలకు ముందు వారి ఇంటి సమీపంలో ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు.