నాగమడుగు ముంపు రైతులను ఆదుకుంటాం

by Sridhar Babu |
నాగమడుగు ముంపు రైతులను ఆదుకుంటాం
X

దిశ,నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని కోమలంచ గ్రామంలో నాగమడుగు ఎత్తిపోతల పథకంలో భూమిని కోల్పోతున్న రైతులను ఆదుకుంటామని బాన్సువాడ ఆర్డీఓ భుజంగరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాజెక్టు నిర్మాణంతో పంట పొలాల ముంపునకు గురైన రైతులతో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు. నిజాంసాగర్ మండలంలో నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తిపోతల పథకం కోసం భూసేకరణ కార్యక్రమం కోసం మహమ్మద్ నగర్ మండలంలోని కోమలంచ గ్రామ రైతులతో శుక్రవారం బాన్సువాడ ఆర్ డీ ఓ భుజంగరావు మాట్లాడుతూ గతంలో జక్కాపూర్, వడ్డేపల్లి, రైతులకు నష్టపరిహారం ఇచ్చినట్లుగా ఎకరానికి 17 లక్షల రూపాయలు అందిస్తామని ఆయన తెలిపారు.

రైతులు మాట్లాడుతూ తమ భూమి ఎంతవరకు కోల్పోతున్నామని అధికారులు తమతో తెలపాలని రైతులు కోరారు. త్వరలో భూ సర్వే నిర్వహిస్తామని ఆయన తెలిపారు. గైని అనంత్ రావు అనే రైతు మాట్లాడుతూ గత ఆరు నెలల నుండి 39 గుంటల నష్టపరిహారం ఇంతవరకు రాలేదని తెలపడంతో ఆర్డీఓ ఆ రైతుతో మాట్లాడుతూ ఎన్నికలు ఉండడం వలన రాలేవని, త్వరలోనే పై అధికారులతో మాట్లాడి డబ్బులు అందిస్తామని ఆయన తెలిపారు. నాగమడుగు ప్రాజెక్టుకు ఇరువైపులా ఏడు కిలోమీటర్ల మేరకు, ఆరు మీటర్ల ఎత్తుతో కరకట్టాలు నిర్మిస్తామని, నీటి నిల్వతో రైతులు పంట భూములు మునిగిపోవని ఆర్డీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ నగర్ మండల తహసీల్దార్ క్రాంతి కుమార్, నీటిపారుదల శాఖ ఈఈ సోలేమాన్, ఏఈ కమల్, రెవెన్యూ ఇన్​స్పెక్టర్ అంజయ్య, సర్వే శ్రీకాంత్ గ్రామ రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed