- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ జిల్లా వైన్స్ లో మద్యం కొంటున్నారా..? జర జాగ్రత్త..
దిశ,మర్రిగూడ :మండల కేంద్రంలో ఉన్న మూడు వైన్ షాపుల యజమానులు సిండికేట్ గా మారి ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. క్వాటర్ నుంచి ఫుల్ బాటిల్ వరకు అదనంగా వసూలు చేస్తూ.. మద్యం ప్రియుల జేబులకు చిల్లులు వేస్తున్నారు. మండల కేంద్రంలో శ్రీ సాయి వైన్స్, ప్రసాదు వైన్స్, లక్ష్మీ దుర్గ వైన్ షాపుల యజమానులు ముగ్గురు సిండికేట్గా మారి ఒక పార్ట్నర్ను నౌకరిదారుగా ప్రమోట్ చేసి మద్యం అమ్మకాలను వారి ఇష్టం వచ్చిన రీతిలో విక్రయిస్తున్నారు. ప్రసాద్ వైన్స్ లక్ష్మీ దుర్గ వైన్స్ రిటైల్ గా మద్యం అమ్మకాలు జరుపుతుండగా.. శ్రీ సాయి వైన్స్ కేవలం బెల్ట్ షాపులకు హోల్సేల్ గా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. వాటర్ బాటిల్ కు 15 రూపాయలు ఫుల్ బాటిల్ కు 80 రూపాయలు వరకు ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు చేస్తున్నారని స్థానికులను ఆరోపిస్తున్నారు. ఆదివారం ఉదయం నుండే మద్యం విక్రయాలు శ్రీ సాయి వైన్స్ నుంచి బెల్టు షాపులకు యదేచ్చగా విక్రయిస్తూ.. ఆటోలో నుంచి గ్రామాలకు తరలివేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు కనీసం ఆ మద్యం దుకాణాల పైన రైడింగ్ లు చేయకపోవడం..మద్యం బాటిల్లను చెక్ చేయకపోవడం కల్తీ మద్యమానికి కూడా దారితీస్తుందని మందుబాబులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇక్కడి వైన్ షాపు నుండే కల్తీ మద్యం అక్రమాలు జరిగాయని రాష్ట్ర టాస్క్ ఫోర్సు అధికారులు కేసులు నమోదు చేసిన విషయం పాఠకులకు విధితమే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బెల్టు షాపులకు మద్యాన్ని విక్రయించకూడదని స్పష్టంగా వైన్స్ యజమానులకు, ఎక్సైజ్ అధికారులకు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఇక్కడి వైన్స్ అధికారులు మాత్రం డోంట్ కేర్ అనే రీతిలో మద్యం అమ్మకాలు యదేచ్చగా జరపడం గమనార్హం. ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు చేస్తూ వైన్స్ యజమానులు ఆడింది ఆట పాడింది పాటగా నడుస్తుందని ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైన్స్ యజమానులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మండల కేంద్రంలో ఉన్న ప్రసాద్ వైన్స్ లక్ష్మీ దుర్గ వైన్స్ దుకాణాలు రిటైల్ అమ్మకాలు జరుపుతుండగా.. శ్రీ సాయి వైన్స్ హోల్సేల్ అమ్మకాలకు తెర లేపింది. కేవలం బెల్ట్ షాపు వారికే మద్యం విక్రయాలు జరుపుతున్నారు. పావు బాటిల్ నుంచి ఫుల్ బాటిల్ వరకు ఎమ్మార్పీ కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ వైన్స్ షాప్ మాత్రం 11:30 12 గంటల వరకు క్రయవిక్రయాలు జరుపుకుంటారు. ఇక గ్రామాలలో మధ్య నిషేధ కమిటీలు ఏర్పాటు చేసిన అవి నామమాత్రంగా మిగిలిపోయాయి తప్ప ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దసరా పండుగ ముందు వారం రోజులు నుంచి బెల్టు షాపులో యజమానులు యదేచ్చగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు.