Pocket Lighters: పాకెట్ లైటర్ విడిభాగాల దిగుమతులపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం

by S Gopi |
Pocket Lighters: పాకెట్ లైటర్ విడిభాగాల దిగుమతులపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం
X

దిశ, బిజినెస్ బ్యూరో: పాకెట్ లైటర్ల విడిభాగాలకు సంబంధించి దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం వాటి దిగుమతులు ఉచితంగానే ఉన్నాయి. పాకెట్ లైటర్ల విడిభాగాలు ప్రధానంగా చైనా, స్పెయిన్, టర్కీ, యూఏఈల నుంచి దిగుమతి అవుతున్నాయి. గ్యాస్‌తో కూడిన నాన్-రీఫిల్, రీఫిల్ చేసిన పాకెట్ లైటర్ల విడిభాగాలను పరిమితం చేస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్‌టీ) తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. పరిమితం చేసిన దిగుమతులకు సంబంధించి చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌తో మాత్రమే ఆయా పరికరాల దిగుమతులకు అనుమతి ఉంటుందని డీజీఎఫ్‌టీ స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలై మధ్య సుమారు రూ. 32 వేల కోట్ల విలువైన పాకెట్ లైటర్ల విడిభాగాలు దిగుమతి అయ్యాయి. గతేడాది ఇదే సమయంలో రూ. 40 వేల కోట్ల విలువైన దిగుమతులు నమోదయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వం రూ. 20 కంటే తక్కువ ఖరీదైన సిగరెట్ లైటర్ల దిగుమతులను నిషేధించింది. గతేడాది నాణ్యత లేని వస్తువుల దిగుమతులను తగ్గించడం, దేశీయ తయారీని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం లైటర్లకు నాణ్యతా ప్రమాణాలను జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed