- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగిసిన సెలవులు... భాగ్యనగరానికి పరుగులు
by Sridhar Babu |
X
దిశ, తిమ్మాపూర్ : తెలంగాణ ప్రజల అతి పెద్ద పండుగ దసరా వేడుకలు నిర్వహించుకునేందుకు హైదరాబాద్ నుంచి చాలామంది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని తమ సొంత ప్రాంతాలకు వచ్చారు. ఆదివారంతో సెలవులు ముగియడంతో అందరూ రాజధానికి పరుగులు పెడుతున్నారు. రాజీవ్ రహదారిపై తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా మీదుగా హైదరాబాద్ కు వెళ్లాల్సి ఉండడంతో టోల్ ప్లాజా వద్ద ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వాహనాల సంఖ్య భారీగా ఉండడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు టోల్ ప్లాజా సిబ్బంది కూడా వెంటనే వాహనాలను పంపించకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు మరింత పెరిగాయని పలువురు వాహనదారులు ఆరోపించారు. పండుగ వేళల్లో టోల్ ప్లాజాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
Advertisement
- Tags
- Traffic
Next Story