మద్యం మత్తులో పురుగుల మందుతాగి మృతి

by Sridhar Babu |
మద్యం మత్తులో పురుగుల మందుతాగి మృతి
X

దిశ, వర్థన్నపేట : పురుగుల మందు తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం హనుమకొండ జిల్లా అయినవోలు మండలం ముల్కలగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై పస్తం శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం గువ్వల రాజు (28) అనే వ్యక్తి దసరా పండుగ సందర్భంగా అధిక మద్యం సేవించిన మైకంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆటోలో చికిత్స నిమిత్తం ఎంజీఎం కు తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై శ్రీనివాస్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story