- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ola Cabs: కస్టమర్లకు రీఫండ్ విషయంలో ఆప్షన్లు ఇవ్వాలని ఓలాకు సీసీపీఏ ఆదేశాలు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆన్‌లైన్ రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్ ఓలాకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. కంపెనీపై వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా కస్టమర్లకు రీఫండ్లు అందజేసే ప్రక్రియను సులభతరం చేయాలని తెలిపింది. రైడ్ క్యాన్సిల్ సమయంలో రీఫండ్లను వినియోగదారుల బ్యాంకు ఖాతా లేదా కూపన్ రూపంలో ఏది కావాలో ఎంచుకునే అనుమతించే విధానాన్ని అమలు చేయాలని సీసీపీఏ ఆదేశించింది. ఇది మాత్రమే కాకుండా ఓలా తన ప్లాట్‌ఫామ్ నుంచి బుక్ చేసిన అన్ని రైడ్‌లకు సంబంధించి బిల్లు లేదా రసీదు లేదా ఇన్‌వాయిస్‌ను ఇవ్వాలని స్పష్టం చేసింది. ఓలా సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీసీపీఏ వెల్లడించింది. కస్టమర్లు రైడ్ క్యాన్సిల్ చేసిన సందర్భాల్లో రీఫండ్ కింద నగదు కాకుండా కూపన్ కోడ్ మాత్రమే ఇస్తోందని, ఇందులో మరే ఇతర అవకాశం లేకుండా తర్వాతి రైడ్‌కు ఉపయోగించవచ్చని ఓలా చెబుతోంది. ఇది వినియోగదారు హక్కులను ఉల్లంఘించడమే అని, వాపసు ఇవ్వకుండా మరొక రైడ్ మాత్రమే ఎంచుకునేలా కస్టమర్లను ప్రోత్సహిస్తోందని కనిపిస్తోంది. ఈ విధానంలో మార్పులు చేయాలని కస్టమర్లు రీఫండ్ విషయంలో ఆప్షన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.