కూటమి నేతల మధ్య విబేధాలు.. గంటా Vs విష్ణు కుమార్ రాజు

by Shiva |   ( Updated:26 April 2025 9:32 AM  )
కూటమి నేతల మధ్య విబేధాలు.. గంటా Vs విష్ణు కుమార్ రాజు
X

దిశ, వెబ్‌డెస్క్: కూటమి నేతల మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు (Ganta Srinivasa Rao), విశాఖ నార్త్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు‌ (Vishnu Kumar Raju)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిలింనగర్ క్లబ్ (Film Nagar Club) లీజు వ్యవహారంలో ఇవాళ వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తన నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా కలుగజేసుకుంటున్నారంటూ గంటా, విష్ణుకుమార్ రాజుపై సీరియస్ అయ్యారు. ఫిలింనగర్ క్లబ్ అనేది భీమిలి నియోజకవర్గ (Bhimili Constituency) పరిధిలోకి వస్తుందని, కానీ ఎమ్మెల్యేకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకువెళ్తారంటూ విష్ణు కుమార్ రాజును గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఈ క్రమంలో విష్ణ కుమార్ రాజు రెస్పాండ్ అవుతూ.. మీరు అందుబాటులో లేకపోవడం వల్లే తాను లీజు విషయంలో కలెక్టర్‌‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చానని గంటాకు సర్దిచెప్పబోయారు. ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే సహించేది లేదని గంటా శ్రీనివాస రావు కోపంతో కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఇద్దరి పంచాయతీ కూటమి నేతల్లో హాట్ టాపిక్‌‌గా మారింది.



Next Story

Most Viewed