రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన : అర్బన్ ఎమ్మెల్యే

by Kalyani |
రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన : అర్బన్ ఎమ్మెల్యే
X

దిశ, నిజామాబాద్ సిటీ : పార్లమెంట్ సాక్షిగా చట్టసభల్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ… హిందువులు ఎవరైతే ఉన్నారో హింస, అసత్యం, ద్వేషం రెచ్చగొడతారు అని మాట్లాడిన మాటలను అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త తీవ్రంగా ఖండించారు. పదేళ్లు అయితే కానీ ప్రతిపక్ష హోద రాని కాంగ్రెస్ పార్టీ జరిగిన ఎన్నికల్లో వంద సీట్లు కూడా గెలవని మహ్మద్ రాహుల్ మతిలేని మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు. కాంగ్రెస్ అంటేనే హిందువుల వ్యతిరేక పార్టీ అని గత 70 ఏళ్ల నుంచి హిందువులను వివక్షకు గురి చేస్తుంది కాంగ్రెసే అని, హిందువుల ఏళ్లనాటి కల అయోధ్య రామమందిరం పున:ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానిస్తే కూడా కాంగ్రెస్ నాయకులు రాలేదని గుర్తు చేశారు.

అదే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న బాబా సమాధికి వెళ్ళడానికి మాత్రం సమయం, ప్రేమ ఉన్నాయని తెలంగాణాలో కూడా రేవంత్ సర్కార్ ఓ వర్గంపై తెగప్రేమ ఓలకపోస్తున్నాడని అన్నారు. కేంద్రం ఉగ్రవాద సంస్థగా గుర్తించి నిషేదించిన జామాతే ఇస్లామి సంస్థకు ప్రభుత్వం నుండి 2 కోట్లు విడుదల చేయడం సభకు వికారాబాద్ లో సకల వసతులు కల్పించడం బట్టే తెలుస్తుంది కాంగ్రెస్ ఈ దేశంలో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తుందని అన్నారు.

ఈ దేశవిచ్చినాన్ని కోరుకుంటుందని, బిజెపి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నంత వరకు ఈ దేశాన్ని భారత మాతను కాపాడుకుంటాం అని, హిందువుల వల్లే ఈ దేశం సురక్షితంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ తోక పార్టీ ఎం ఐ ఎం అధినేత జై పాలస్తిన అనడం రాహుల్ చేసిన వ్యాఖ్యలకు యావత్ హిందూ సమాజం ఖండిస్తుందని, వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని, బిజెపి గురించి, హిందువుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.

Next Story

Most Viewed