అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ధోని.. సీఎస్కేకు ఆడే చాన్స్!

by saikumar |
అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ధోని.. సీఎస్కేకు ఆడే చాన్స్!
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది-2025లో ఐపీఎల్ మెగావేలం జరగనుంది. రెండు సార్లు భారత్‌కు ప్రపంచ కప్‌లు అందించిన మహేంద్ర సింగ్ ధోని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఈసారి వేలంలో పాల్గొనవచ్చని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. అదే జరిగితే ధోనిని సీఎస్కే జట్టు తిరిగి రిటైన్ చేసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఐదేళ్లు గడిస్తే భారత ఆటగాళ్లను అన్‍క్యాప్డ్ ప్లేయర్‌గా గుర్తించే రూల్‍ను 2008లో బీసీసీఐ తెచ్చింది. 2021 తర్వాత దాన్ని రద్దు చేసింది. తాజాగా మరోసారి ఆ రూల్‌ను ఇప్పుడు మళ్లీ తీసుకొచ్చింది. దీంతో అన్‍క్యాప్డ్ ఆటగాడిగా రూ.4 కోట్లకు ధోనీని చెన్నై రిటైన్ చేసుకునే చాన్స్ ఉంది. అదే జరిగితే ధోనీ వచ్చే సీజన్లో ఆడే అవకాశాలుండటంతో మహీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed