- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rahul Gandhi : పర్మిషన్ లేకుండా రాహుల్ గాంధీ హర్యానాకు రాలేరు : బీజేపీ
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇక హర్యానాకు రావాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సిందేనని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. హర్యానాలోని కాంగ్రెస్ పార్టీ ‘హుడా కాంగ్రెస్’గా మారిపోయినందున రాహుల్ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చి పడిందని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘రాష్ట్రంలో ఏదైనా పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలని తొలుత కాంగ్రెస్ భావించింది. అయితే అందుకు హుడా ఒప్పుకోలేదు. దీంతో తమ నిర్ణయాన్ని పార్టీయే మార్చుకుంది.
ఫలితంగా హర్యానా కాంగ్రెస్ పార్టీ హుడా కాంగ్రెస్‌గా మారిపోయింది’’ అని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. కనీసం కుమారి సెల్జా వంటి సీనియర్ నేతలను కాంగ్రెస్ పార్టీ గౌరవించి ఉండాల్సిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ హర్యానాలో కాకుండా మరో రాష్ట్రంలో విడుదల చేయడం విడ్డూరంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు.