రైతు,కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ట్రాక్టర్, బైక్ ర్యాలీ

by Sridhar Babu |
రైతు,కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ట్రాక్టర్, బైక్ ర్యాలీ
X

దిశ, నిజామాబాద్ సిటీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నిజామాబాద్ నగరంలో అఖిల భారత రైతు కూలి సంఘం, ఇఫ్టు,పీడీఎస్​యూ ఆధ్వర్యంలో ట్రాక్టర్, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్​)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ రైతుల రుణాలను మాఫీ చేయాలని, 2006 అటవీ హక్కుల చట్టాన్నిఅమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఇఫ్టు జిల్లా అధ్యక్షుడు బి.భూమన్న మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని , కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ను ఆపాలని ,నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు దేశెట్టి సాయిరెడ్డి, సూర్య శివాజీ, ఖాజా మోహినుద్దీన్, శివకుమార్, జన్నారపు రాజేశ్వర్, జేపీ గంగాధర్, భారతి, దేవస్వామి, గంగన్న, బన్సీ , ప్రిన్స్, వంశీ, ఎల్లప్ప, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed