- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఇంటి నంబర్ వాల్యూ రూ.2 కోట్లు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రవాణా శాఖాలో వాహనాల రిజిస్ర్టేషన్ నెంబర్ కు కోట్ల వెచ్చించడం సర్వసాధరణం. సెంటిమెంట్ లతో పాటు పుట్టిన రోజులను, తమకు కలిసి వచ్చే సంఖ్యలను లక్కి నంబర్ లను తమ వాహనాలకు పెట్టడానికి వాహనాల యజమానులు లక్షల నుంచి కోట్ల కుమ్మరించడం సర్వ సాధరణం. కాని ఒక ఇంటి నెంబర్ వాల్యూ కోట్లలో ఉంది. అంటే అది రాష్ర్ట రాజదాని హైద్రాబాద్ అనుకుంటే పోరబడినట్లే. అది నిజామాబాద్ జిల్లా కేంద్రంలో.. ఇటివల కొత్తగా గత ఎడాది ప్రారంభమైన జిల్లా ఇంటిగ్రేటేడ్ కలెక్టరేట్ కు ఆనుకుని ఉన్న ఒక అసైండ్ ల్యాండ్ కు ఇంటినెంబర్ వేసి కోట్ల రూపాయాలకు ఎసరు పెట్టారు కొందరు.
ఆ ఇంటి నంబర్ విలువ అక్షరాల రూ.2 కోట్లు. నిజామాబాద్ కొత్త జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలోని న్యాక్ బిల్డింగ్ సమీపంలో ఓ ప్రభుత్వ భూమి ఉంది. దీనిని కబ్జా చేసేందుకు ఇంటి నంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కొందరు. ఆ డాక్యుమెంట్ ను చూపి ప్రభుత్వానికి చెందిన 1100 గజాల భూమిని తన్నుకుపోయారు. దీనిని నగరంలోని ప్రజాప్రతినిధికి రూ.కోటికి అమ్మారు. ఆ తర్వాత మాజీ కార్పొరేటర్ భర్తను అడ్డం పేట్టి రూ.2 కోట్లకు కొనుగోలు చేశారు. ఇలా ఖానాపూర్ గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన ఇంటి నంబర్, ప్రభుత్వ భూమి కలిసి రూ.2 కోట్లకు పలికింది. ఈ తతంగం వెనక మరో కుట్ర దాగి ఉంది. రూ.కోటికి అమ్మి రూ.2 కోట్లకు కొన్నారంటే అర్థం చేసుకోవాలి మరి. ఈ భూమి వెనకాలే ఒక్క ఎక్కరం పట్టా భూమి, మూడు ఎకరాల అసైన్ మెంట్ భూమి ఉంది. ఈ భూముల్లోకి వెళ్ళాలంటే బైపాస్ ప్రధాన రహదారి నుంచి రూ.2 కోట్ల భూమి నుంచే వెళ్ళాలి. ఆ రోడ్డును ప్యాక్ చేసి, వారి పని చేసుకునేందుకు ప్రజా ప్రతినిధి అమ్మారు. క్లియర్ చేసుకొని, వెనక భూముల వారిని బ్లాక్ మెయిల్ చేసి తక్కువ ధరకు కోట్టేసే పనిలో ఉన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం భూమాయ కొనసాగుతుంది. నిజామాబాద్, ఖానాపూర్ శివారు భూములు కలిసి ఉండడంతో భూ మాయగాళ్లకు ఈ అవకాశం కలిసి వస్తుంది. దీనికోసం ప్రభుత్వ భూములను లక్ష్యంగా పెట్టుకొని యదేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. అందులో భాగంగానే కలెక్టరేట్ సమీపంలోని నాక్ బిల్డింగ్ చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములపై కన్నేశారు. అందుకు నిజామాబాద్ నగరానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్యనేత, ప్రజాప్రతినిధిని అడ్డం పెట్టుకొని అక్రమాలను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే నిజామాబాద్ నగర శివారు సర్వేనెంబర్ గల భూమిలో ఖానాపూర్ గ్రామం నుంచి ఇంటి నెంబర్ తీసుకొని ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు.
అందుకోసం ఇంటి నెంబర్ ప్రకారం ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. ఇంకేముంది కబ్జా చేసిన భూమికి కోట్ల ధర పలుకుతుంది. దీని కోసం భూ మాఫియాలోని ఇద్దరు వ్యక్తులు ఒకరు రాష్ర్ట ప్రజా ప్రతినిధి అనుచరులు కాగా మరొకరు లోకల్ ఎరియా ప్రజా ప్రతినిధి అనుచరులు కావడం విశేషం. వీరిద్దరూ కలిసి ప్రతినిధికి ఆ భూమిని రూ.75 లక్షలకు కట్టబెట్టారు. తిరిగి అదే భూమిని కోటి యాభై లక్షలకు కొనుగోలు చేశారు. సర్కారు భూమిని ఇంటి నెంబర్ ద్వార కబ్జా చేసి రిజిస్ర్టేషన్ వ్యవహరంలో మరొ మతలబు ఉంది.
అదేంటంటే ఈ భూమి వెనకాలే ఉన్న ఒక్క ఎకరం పట్టా భూమి, మూడెకరాల అసైన్మెంట్ భూమిపై కన్నేశారు సధరు వ్యక్తులు. అందుకోసమే అమ్మిన భూమిని రెట్టింపు ధరకు కొనుగోలు చేశారు. ఇది అసలు కథ. అయితే న్యాక్ బిల్డింగ్ సమీపంలో ఉన్న ఈ భూమి ప్రభుత్వానిది కావడం విశేషం. అయితే ఈ భూమిని అంత ధర పెట్టి కొనడం వల్ల వెనకాల ఉన్న భూముల ధర తక్కువగా వస్తుంది. ఈ భూమి లేకపోతే వెనక భూమికి రోడ్డు లేకపోవడమే అసలు విషయం. దీంతో సుమారు 10 కోట్ల వరకు లాభాలు అంచనా వేసుకున్న భూ మాఫియా ఏకంగా ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టి పట్టా భూములను కొనే పనిలో పడ్డారు.. దీనికోసం కోందరు మధ్యవర్తిగా ఉంటూ సినిమా ఫక్కీలో వ్యవహారం నడిపిస్తున్నారు.