మాజీ ఎమ్మెల్యేకు సహకరించిన ఎస్ హెచ్ ఓ అరెస్టు

by Sridhar Babu |
మాజీ ఎమ్మెల్యేకు సహకరించిన ఎస్ హెచ్ ఓ అరెస్టు
X

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్ లో శనివారం వరకు ఎస్ హెచ్ ఓ గా పనిచేసిన బీడీ ప్రేమ్ కుమార్ ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ తనయుడు రాహిల్ కొద్ది రోజుల క్రితం మద్యం మత్తులో ప్రగతి భవన్ వద్ద బారీకేడ్లను ఢీ కొట్టిన విషయం తెలిసింది. ఈ కేసులో షకీల్ ఆమెర్ తనయుడిని తప్పించేందుకు ఆనాడు ప్రయత్నించిన స్థానిక ఎస్హెచ్ఓ ను పోలీసు అధికారులు ఆనాడు సస్పెండ్ చేసిన విషయం తెలిసింది.

ఈ కేసులో తనయుడిని తప్పించేందుకు ప్రయత్నించిన షకీల్ ఆమీర్ పేరును ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేసిన విషయం విధితమే. ఆనాడు ఆ కేసులో షకీల్ ఆమీర్ కు సహకరించినట్టు పోలీసు విచారణలో తేలడంతో బీడీ ప్రేమ్ కుమార్ ను ఆదివారం పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. బీడీ ప్రేమ్ కుమార్ ను శనివారం బోధన్ ఎస్హెచ్ఓ విధుల నుంచి తప్పించి నిజామాబాద్ సీసీఎస్ కు అటాచ్ చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే సైకిల్ ఆమెర్ ప్రధాన అనుచరుడు అబ్దుల్ వాసేను కూడా పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed