మున్సిపల్ చైర్మన్ పీఠం హస్త గతం

by Kalyani |
మున్సిపల్ చైర్మన్ పీఠం హస్త గతం
X

దిశ కామారెడ్డి క్రైమ్ : కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత నుంచి నూతన చైర్పర్సన్ ఎవరు అనే ఉత్కంఠతకు తెరపడింది. సోమవారం క్యాంపు నుంచి వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్ పర్సన్ గా గడ్డం ఇందు ప్రియను ఎన్నుకున్నారు. కొద్దిరోజులుగా ఉరుదొండ వనిత, గడ్డం ఇందుప్రియ మధ్యలో చైర్మన్ సీటు కోసం పోటీ కొనసాగింది. అయితే అధిష్టానం ఇరువురిని సముదాయించడం తో పాటు సీల్డ్ కవర్ గడ్డం ఇందు ప్రియ పేరు ప్రకటించడం జరిగింది.

క్యాంపు నుంచి వచ్చిన కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ ఎన్నిక సమయం వరకు కూడా ఎవరు అనేది గోప్యంగా ఉంచిన అధిష్టానం ఎట్టకేలకు ఫీల్డ్ కవర్ ద్వారా బహిర్గతం చేసింది. అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ కౌన్సిలర్ లతోపాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు 10 మంది సైతం మద్దతు తెలిసినప్పటికీ చైర్ పర్సన్ ఎన్నిక సమయంలో మాత్రం వీరు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed