- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరిఫ్ డాన్ మర్డర్ కేసులో మాస్టర్ మైండ్ ఎక్కడ ?
దిశ, నిజామాబాద్ క్రైం : ఈ నెల 1న నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో జాతీయ రహదారి 63 పై జరిగిన రౌడి షిటర్ సయ్యద్ అరిఫ్ అలియాస్ అరిఫ్ డాన్ మర్డర్ కేసులో ప్రధాన సూత్రదారి పిర్ధోస్ కోసం పోలిస్ ల వేట కోనసాగుతుంది. నాగారం కు చెందిన ఫిర్ధోస్ తో పాటు మరో 8 మంది కలిసి రౌడిషిటర్ అరిప్ డాన్ ను మట్టు బెట్టిన విషయం తెలిసిందే. ఈ నెల మొదటి వారంలో 6 గురిని పోలిస్ లు అరెస్టు చేయగా, సోమవారం ఇమ్రాన్, సోహైల్ లను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు పోలిస్ లు. అరిప్ డాన్ హత్య కేసులో 8 మంది పట్టుబడగా ఇప్పటికి పిర్దోస్ అలియాస్ పిద్దు అచూకి లభించలేదు. అరిఫ్ హత్య జరిగిన తరువాత ఫిర్ధోస్ కుటుంబం తో సహ కనిపించకుండా పోయాడు. నిజామాబాద్ నగరంలో రౌడిషిటర్ ల హత్యలకు ప్రతికార హత్యలు జరుగుతున్న విసయం తెలిసిందే. డిసెంబర్ 31న నిజామాబాద్ అరవ టౌన్ పరిధిలోని నెహ్రునగర్ వద్ద రౌడిషిటర్ జంగల్ ఇబ్రహిం హత్య జరిగిన విషయం తెలిసిందే..
ఈ కేసులో రౌడిషిటర్ అరిప్ డాన్ తో పాటు 15 మంది అరెస్టు కాగా మూడు నెలల క్రితం జైలు నుంచి బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. జంగల్ ఇబ్బు అలియాస్ ఇబ్రహీం హత్యకు ప్రతికారంగా అతని దాయాదులు, మరికోందరు కలిసి అరిప్ డాన్ ను బోదన్ కోర్టుకు హజరై తిరుగు ప్రయాణంలో ఉండగా సినిమా పక్కిలో ప్యాక్షన్ తరహలో మర్డర్ చేసిన విషయం తెలిసిందే. అరిప్ డాన్ ప్రయాణిస్తున్న బైక్ ను లారీతో డికోట్టించి కింద పడగానే మరో కారులో వచ్చిన ప్రత్యర్దులు కత్తులతో పోడిచి హత్య చేశారు. అనాటి నుంచి అందరు పరారీలో ఉండగా ఇప్పటి వరకు ఓక్క పిర్ధోస్ మినహ మిగిలిన 8 మంది పోలిస్ లకు పట్టు బడ్డారు. నాగారం పిర్ధోస్ అలియాస్ పిద్దు, రౌడిషిటర్ అరిప్ డాన్ లు చిన్న నాటినుంచి స్నేహితులు. చిల్లర దోంగతనలు మొదలుకోని, సైడ్ దందాలలో ఇద్ధరు పార్టనర్ లు అనే విషయం అందరికి బహిరంగ రహస్యమే.
అరిప్ డాన్ హత్యకు ముందు వరకు కుడా అతడికి రూ.60 నుంచి 70 లక్షలు రావాల్సి ఉందని వాటిని సెటిల్ చేయాలని చెప్పినట్లు సమాచారం.. అదే సమయంలో జంగల్ ఇబ్రహిం ను హత్య చేసిన అరిప్ డాన్ మరి కోందరు జైలు నుంచి వచ్చిన తరువాత పిర్ధోస్ పై ఓక కన్నేసినట్లు మైనార్టి ఎరియాల చర్చ జరుగుతుంది. ఈ విషయంను ముందు పసిగట్టిన పిర్ధోస్, జంగల్ ఇబ్రహిం కు సన్నిహిత కుటుంబ సభ్యులతో కలిసి అరిప్ డాన్ మర్డర్ స్కేచ్ వేసి అమలు చేసినట్లు తెలిసింది. అరిప్ డాన్ హత్యకు వాడినట్లుగా చెబుతున్న లారీతో పాటు కారు కుడా సమకుర్చడంతో పాటు కోర్టుకు వేళ్లక ముందు వరకు అతని పక్కనే ఉండి అతడి రాకపోకలు గమనించి పక్క పథకాన్ని అమలు చేసినట్టు అరిప్ డాన్ సన్నిహితులు చెబుతున్నారు. అరిప్ డాన్ హత్య తరువాత కనిపించకుండా పోయిన మాస్టర్ మైండ్ ఫిర్ధోస్ కోసం పోలిస్ లు వేట కోనసాగిస్తున్న ఇప్పటి వరకు అచూకి కనిపెట్ట లేకపోయారు.