రైల్వేస్టేషన్ లో 4 లక్షల గల్లంతు.. గంట వ్యవధిలో బాధితుల చేతికి డబ్బులు

by Sumithra |   ( Updated:2022-09-26 15:59:21.0  )
రైల్వేస్టేషన్ లో 4 లక్షల గల్లంతు.. గంట వ్యవధిలో బాధితుల చేతికి డబ్బులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ రైల్వేస్టేషన్ లో ఆదివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి నీళ్ళు తాగేందుకు క్యాంటిన్ కు వెళ్లి అక్కడ డబ్బులున్న బ్యాగును మరిచిపోయాడు. చేతిలో ఉన్న డబ్బులున్న బ్యాగు కనిపించక పోవడంతో స్థానిక 1వ టౌన్ పోలీసులు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు చాకచక్యంగా బ్యాగును పట్టుకుని అందులో నగదును తిరిగి బాధితునికి అప్పగించారు. వారిని నిజామాబాద్ సీపీ కె.ఆర్.నాగరాజు అభినందించారు.

డిచ్ పల్లి మండల కేంద్రానికి చెందిన అబ్దుల్లాపురం చిన్నారెడ్డి అనే వ్యక్తి రైల్వేస్టేషన్ లో ఆదివారం రాత్రి నీళ్లు తాగేందుకు క్యాంటిన్ వద్దకు వెళ్లి తన బ్యాగులో ఉన్న రూ.4 లక్షల 20 వేలు అక్కడే మరిచిపోయాడు. తర్వాత కొద్దిసేపటికి తన బ్యాగు కోసం వెళ్లే సరికి అది కనిపించలేదు. బాధితుడు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెట్రోలింగ్ లో ఉన్న ఏఎస్సై బన్సీలాల్, కానిస్టేబుల్ గోవర్ధణ్ అనే కానిస్టేబుళ్ళు అక్కడికి చేరుకుని చిన్నారెడ్డి పొగొట్టుకున్న బ్యాగును గుర్తించి అతనికి అప్పగించారు. గంటల వ్యవధిలోనే సుమారు రూ.4 లక్షల నగదును పోలీసులు తిరిగి అప్పగించడంతో ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story